Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

భూసార పరీక్షలపై అవగాహణ కార్యక్రమాలు

విశాలాంధ్ర, గరుగుబిల్లి/పార్వతీపురం: భూసార పరీక్షలపై, మట్టి నమూనా సేకరణ, ఎరువుల వినియోగం గూర్చి తోటపల్లి జట్టు సంస్థ ప్రాంగణంలో అవగాహణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా జిల్లా వ్యవసాయ అధికారి కె. రాబర్ట్ పాల్ విచ్చేసి భూసార పరీక్షలపై, మట్టి నమూనా సేకరణ గూర్చి, సమతుల్యం గూర్చి వివరించారు. భూసార పరీక్షలకు సంబందించి మట్టి నమూనాల సేకరణపై డిమాన్స్త్రేషన్ చేయించారు. ఈకార్యక్రమంలో ఆయనతో పాటు జిల్లా శిక్షణ కో ఆర్డినేటర్ ఆర్ శ్రీనివాసరావు, జిల్లా వ్యవసాయ కార్యాలయం ఏడిఏ కె.శ్రీనివాసరావు, మాస్టర్ ట్రైనీ బి.శారద, నాలుగు సభ్ డివిజన్ ఏడిఏలు, ప్రకృతి వ్యవసాయ డిపిఎం, రైతుభరోసా కేంద్రాల విఏఏలు, జట్టు సంస్థ సిబ్బంది , రైతులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా ఇటీవల కురిసిన వర్షాలకు కొమరాడ,మక్కువ, భామిని తదితర 8మండలాల్లో 603మంది రైతులకు చెందిన 213.5హెక్టార్ల పంట నష్టం జరిగిందని విలేకరులకు తెలిపారు.26.51లక్షల రూపాయల నష్టం జరిగిందని నివేదికను కూడా ప్రభుత్వానికీ అందజేశామన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img