విశాలాంధ్ర సంతబొమ్మాలి( శ్రీకాకుళం) : ఈ మండలం నౌపడ శాఖ గ్రంథాలయ అధికారిని బీరుపావతికి ఉత్తమ లైబ్రేరియన్ అవార్డు లభించింది. 56వ జాతీయ గ్రంథాలయాల వారోత్సవాల సందర్భంగా, వారం రోజులు పాటు విద్యార్థులతో వివిధ కార్యక్రమాలు నిర్వహించడంపై జిల్లా గ్రంధాలయ అధికారులు ఆమె సేవలను గుర్తించి మంగళవారం సన్మానం చేశారు. ఈ సందర్భంగా జిల్లా గ్రంథాలయాల చైర్పర్సన్ సువారి సువర్ణ, గ్రంథాలయాల సంస్థ కార్యదర్శి బుర్ర కుమార్ ఉత్తమ అవార్డు అందుకున్న రూపావితికి పూలమాలలు సాలువలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ లైబ్రేరియన్ ఎ శంకర్రావు గ్రంథాలయాల ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కాళ్ల రాజు లైబ్రేరియన్ ఎస్వీ రమణమూర్తి ఆయా గ్రంథాలయాల లైబ్రేరియన్లు పాల్గొన్నారు.