Sunday, October 2, 2022
Sunday, October 2, 2022

సిపిఎస్ ఉద్యోగసంఘాల నేతలపై బైండోవర్ కేసులు నమోదు

విశాలాంధ్ర,పార్వతీపురం: సెప్టెంబరు 1న మిలీనియం మార్చ్ పేరిట ముఖ్యమంత్రి ఇళ్లు ముట్టడికి సిపీఎస్ ఉద్యోగులు పిలుపునివ్వగా వారిపై సెక్షన్ 149 క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ప్రకారం నోటీసులు ఇచ్చి బైండోవర్ కేసులను నమోదును పార్వతీపురం పోలీసులు శుక్రవారం నిర్వహించారు. స్థానిక తహశీల్దార్ కార్యాలయం వద్ద ఉద్యోగులతో సంతకాలు చేయించారు. మిలీనియం మార్చ్ కార్యక్రమాలకు స్థానిక పోలీస్ అధికారులవద్ద నుండి లేదాప్రభుత్వం నుండి ఏవిధమైన అనుమతిలేదని, ఈకార్యక్రమాలకు సిపిఎస్ ఉద్యోగులు వెళ్ళబోతున్నట్లుగా సమాచారం తెలిసినందున ఈకేసులు నమోదు చేస్తున్నట్లు వారు ఈనోటిసులో తెలిపారు. ఈకార్యక్రమాల సందర్భంగా శాంతి భద్రతలకువిఘాతంకులుగుతుందని, అంతమంది ఒకచోట గుమికూడిన తర్వాత అక్రమ సమావేశంగా ఏర్పడి  నేరములు జరిగేఅవకాశం ఉన్నట్లుగా సమాచారంతో కేసులు నమోదు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.ఈనోటీసులను ఉల్లంఘించిన యెడల మీపై చట్టప్రకారం తగిన క్రిమినల్ చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆనోటీసులో పేర్కొన్నారు. ఇదిలా ఉండగా ఉద్యోగులపై బైండోవర్ కేసులు పేరిట భయబ్రాంతులకు గురిచేయడాన్ని ఖండిస్తున్నట్లు ఎన్ జి ఓ సంఘం పార్వతీపురం మన్యం జిల్లా అధ్యక్షుడు కిషోర్ తెలిపారు. కేసులపేరిట బెదిరిస్తున్నారని అయన చెబుతూ, ఉద్యోగుల హక్కులను హరించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.శుక్రవారం సాయంత్రం ఆన్ని సంఘాల నేతలతో కలిసి ఆయన సెప్టెంబరు 1న మిలీనియం మార్చ్ పేరిట నిర్వహించనున్న సీఎం ఇల్లుముట్టడిలో
సిపిఎస్ ఉద్యోగులు అంతా పాల్గొని విజయవంతం చేయాలని ఆయన పిలుపు నిచ్చారు. దీనికి సంబంధించి గోడ పత్రికలను అందరితో కలిసి విడుదల చేశారు. 

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img