Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

112 కు కాల్ చేయండి …సురక్షితంగా ఇంటికి చేరుకోండి

. రాత్రి వేళల్లో పోలీసు వాహనాలలో డ్రాప్ టు హోమ్
. జిల్లా ఎస్పీ జి.ఆర్.రాధిక

విశాలాంధ్ర – శ్రీకాకుళం: టోల్ ఫ్రీ నెంబర్ 112 కు కాల్ చేస్తే ఒంటరి మహిళలను రాత్రి వేళల్లో సురక్షితంగా పోలీసు వాహనాలలో ఇంటికి డ్రాప్ చేస్తారు అని జిల్లా ఎస్పీ జి.ఆర్.రాధిక తెలిపారు. ఈ మేరకు బుధవారం ప్రకటన జారీ చేస్తూ రాత్రి వేళలో ప్రయాణించి, అనుకొని సమయములో ఎటువంటి రవాణా సౌకర్యం లేక ఇంటికి చేరుకోలేని ఒంటరి మహిళల కొరకు సురక్షితంగా రాత్రి వేళల్లో పోలీసు వాహనాలలో ఇంటి వద్దకు చేర్చేందుకు నైట్ డ్రాప్ టు హోమ్ అనే ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రవేశపెడుతున్నామని జిల్లా ఎస్పీ శ్రీమతి జి ఆర్ రాధిక పేర్కొన్నారు. మహిళలు భద్రత కోసం పోలీసు శాఖ అందిస్తున్న సేవలను మహిళలు సద్వినియోగం చేసుకోవాలని ఎస్పీ తెలియజేశారు. రాత్రి వేళలో 11 గంటల తర్వాత ఇంటికి చేరుకోవడానికి రవాణా సౌకర్యం లేని పక్షంలో అధైర్యం పడకుండా 112 టోల్ ఫ్రీ నెంబర్ కాల్ చేస్తే సంబంధిత పోలీసులు సబ్ డివిజన్ పరిధిలోని దిశ వాహనాలు, పోలీసు స్టేషన్ పరిధిలోని ఉన్న వాహనాలు ద్వారా పోలీసులు సురక్షితంగా మీ ఇంటికి చేర్చుతారని ఎస్పీ పేర్కొన్నారు. అదేవిధంగా రాత్రి పూట ప్రయాణం చేసే మహిళలు అపరిచిత వ్యక్తులను నమ్మవద్దుని,దగ్గర్లో ఉన్న బస్సు, రైల్వే స్టేషన్ లో ఉన్న పోలీస్ ఔట్ పోస్టులు,రైల్వే పోలీసు రక్షక స్టేషన్లో వేచి చేయాలని ఎస్పీ కోరారు. ప్రతి మహిళ ఫోన్లో దిశ యాప్ నిక్షిప్తం చేసుకోవాలని ఈ సందర్భంగా ఎస్పీ తెలియజేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img