Tuesday, April 23, 2024
Tuesday, April 23, 2024

ప్రజా పంపిణీ వ్యవస్థపై పిర్యాదులకు టోల్ ఫ్రీ నంబరుకు ఫోన్ చేయండి

రాష్ట్ర ఆహార కమిషన్ చైర్మన్

విశాలాంధ్ర_పార్వతీపురం: ప్రజాపంపిణీ వ్యవస్థలో పిర్యాదులుంటే టోల్ ఫ్రీ నంబరు155236 కు ఫోన్ చేయాలని రాష్ట్ర ఆహార కమిషన్ చైర్మన్ సిహెచ్. విజయప్రతాప్ రెడ్డి తెలిపారు.బుధవారంనాడు అయన పార్వతీపురం మన్యం జిల్లాపర్యటనకు విచ్చేశారు.స్థానిక ఐటిడిఎ కార్యాలయ సమావేశమందిరంలోని గిరిమిత్రసమావేశ మందిరంలోఅధికారులతో సమావేశం నిర్వహించారు. ఈసమావేశంలో ఆయన మాట్లాడుతూ పేదలకు, విద్యార్థులకు పౌష్టికాహారం అందించే ఉద్దేశంతో ప్రవేశపెట్టిన ఈపధకాన్ని సక్రమంగా అమలు చేయాలన్నారు. ప్రజాపంపిణీ వ్యవస్థలో అధికారులు నిబద్దతతో పనిచేయాలని తెలిపారు. అధికారుల పనితీరు బాగుండాలన్నారు. ప్రజలకు పంపిణీ చేస్తున్న సరుకులు నాణ్యతగా ఉండాలని, డీలర్లు, ఎం .ఎల్.ఒ. పాయింట్లు నుండి సరైన కొలతలతో సరుకులు సరఫరా చేయాలన్నారు. పేదల ఆకలి తేర్చేందుకు ప్రభుత్వం కేజీబియ్యం 37రూపాయలకుకొని ఒక్కరూపాయికే అందిస్తున్నదని, కేంద్రప్రభుత్వం కూడా పేదలకు ఉచితంగా ఆహారం సరఫరా చేస్తుందని తెలిపారు. ఆరోగ్యవంతమైన సమాజానికి చక్కని పౌష్టికాహారం అందించాలనే ఆశయంతో ఐ.సి.డి.ఎస్. ద్వారా గర్బస్థ దశనుండే ఆహారం అందించడం జరుగుందన్నారు. గర్బిణీలలో రక్తహీనత నిరోధించుటకు, పౌష్టికాహార లోపం లేకుండా సరియైన బరువుతో శిశువు జన్మించుటకు, పుట్టిన తరువాత పోషణకు, మూడవ సంవత్సరం నుండి అంగన్వాడిద్వారా, ఆరవ సంవత్సరం నుండి పాఠశాలలో మద్యాహ్న బోజన పధకం ద్వారా పౌష్టికాహారం అందించడం జరుగుతుందన్నారు. పోషకవిలువలతో కూడిన ఫోర్డ్ ఫైడ్ బియ్యం ప్రతి 50 కేజీలకు 500 గ్రాముల కలపడం జరుగుతుందని ప్రజలు అపోహలు వీడి వాటిని వాడి పౌష్టికాహారలోపాన్ని నివారించుకోవాలని తెలిపారు. ఈబియ్యంవాడడంవలన మెదడు, ఎముకల పెరుగుదల ఉటుందని తెలిపారు. సంక్షేమ హాస్టల్లు నందు వార్డెన్స్ తప్పనిసరిగా విద్యార్థులు రాత్రిబోజనం అయినంతవరకు ఉండాలని, చాలాచోట్ల క్రింది స్థాయి సిబ్బందికి బాద్యతలు అప్పగిస్తున్నారని, అదిసరియైన పద్దతికాదన్నారు.అటువంటి వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ప్రజాపంపిణీ వ్యవస్థలో సివిల్ సప్లయి, ఐ.సి.డి.ఎస్. లీగల్ మెట్రాలజీ, విద్యాశాఖ, సంక్షేమశాఖలు కీలకమని అన్ని శాఖల అధికారులు, ఆకస్మిక తనిఖీలు నిర్వహించి,భాద్యతగా విధులు నిర్వహించి ఈపధకాన్ని విజయవంతం చేయాలని తెలిపారు.నాణ్యతలేని సరుకులు పంపిణీచేసినా, లేదా యితర పిర్యాదులకు టోల్ ఫ్రీ నంబరు 155235కు ఫోన్ ద్వారా, లేదా వాట్సాప్ నంబరు 9490551117కు వాట్సాప్ ద్వారా పిర్యాదు చేయవచ్చునని, పిర్యాదుదారు వివరాలు గోప్యంగా ఉంచబడుతాయని తెలిపారు. ఉపసంచాలకులు డి.సురేష్ మాట్లాడుతూ పిర్యాదులు, పత్రికలలో వచ్చిన వార్తలపై విచారణజరిపి, చర్యలు తీసుకొని వాటి నివేదికలను పంపించాలన్నారు. సమావేశఅనంతరం పార్వతీపురం చర్చిరోడ్డులోగల మున్సిపల్ ప్రైమరీ స్కూల్ మరియు డా. వేంకోజిరావు. మున్సిపల్ మెమోరియల్ స్కూల్, గరుగుబిల్లిమండలంలోని నాగురు జిల్లాపరిషత్ హైస్కూలు లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించి,మద్యాహ్న బోజనం పధకాన్ని పరిశీలించారు. ఈకార్యక్రమంలో జిల్లా మేనేజరు ఎం .డి.నాయక్, జిల్లా పౌర సరఫరాల అధకారి మధుసూధనరావు, విద్యాశాఖాధికారి బ్రహ్మాజీ ఇతర అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img