. విశాఖను రాజధానిగా చేయవద్దని తీర్పునిచ్చిన ఉత్తరాంధ్ర పట్టభద్రులు
. 2024ఎన్నికలకు సెమీఫైనల్ ఎన్నికలివి..
. 2024లో టీడీపీదే అధికారం
. బడ్జెట్ అంతా మోసపూరితమే
ఎన్నికలముందు మూడువేల పించన్ అమలు చేస్తానని చెప్పడం మోసమే
విశాలాంధ్ర, పార్వతీపురం: ఆంధ్ర ప్రదేశ్ రాజధాని అమరావతికి గౌరవంఇస్తూ, మూడు రాజదానుల నినాదానికి, విశాఖ పట్టణంను రాజదానిగాచేస్తామని చెప్పిన ముఖ్యమంత్రి ప్రకటనలకు వ్యతిరేఖంగా ఉత్తరాంధ్ర జిల్లాల పట్టభద్రులు ఓటు హక్కు అనే ఆయుధంద్వారా బలమైన తీర్పు నిచ్చారని రాష్ట్ర టిడిపి అధికార ప్రతినిధి,మాజీ ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి జగదీష్, మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ ఇంచార్జి బొబ్బిలి చిరంజీవులు తెలిపారు.శుక్రవారం స్థానిక తెలుగు దేశం పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్సీ ఎన్నికలు పలితాలు ప్రకటన సమయంలో నియోజక వర్గ నేతలతో కలిసి సంబరాలు జరుపుకున్నారు. ఉత్తరాంధ్ర జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా టిడిపి తరుపున పోటీచేసిన వేపాడ చిరంజీవిరావు వేలఓట్లు సాధించి గెలిచినట్లు ఖరారు కావడంతో పార్టీ కార్యాలయంలో స్వీట్లు పంచిపెట్టారు. పటాసులు పేల్చారు. టిడిపికు జేజే లంటూ నినాదాలు చేశారు.ఈసందర్భంగా విలేకరులతో మాట్లాడారు.గురువారం రాష్ట్ర అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్లో రెండు కళ్లుగా చెప్పుకొనే ముఖ్యమంత్రి జగన్ సంక్షేమం, అభివృధ్ధికి కొత్త కేటాయింపులు ఏమీలేవని వారు తెలిపారు. కొత్తజిల్లాలు ఏర్పాటు చేసిన ప్రభుత్వం వీటికి బడ్జెట్ లో ఏటువంటి కేటాయింపులు చేయలేదన్నారు. తోటపల్లి, జంఝావతి, గుమ్మడిగెడ్డ ఇలా ఉండే ఏసాగునీటి ప్రాజెక్టులకు కేటాయింపులు లేవన్నారు. బడ్జెట్ పెట్టిన తరువాత రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల కంటే వ్యక్తిగత పనులకోసం ఢిల్లీవెళ్ళడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. బడ్జెట్లో తలసరి ఆదాయం కంటే అప్పులే ఎక్కువగా చూపించారని తెలిపారు.గత ఎన్నికల్లో టిడిపిను మరలా గెలిపిస్తే తక్షణమే 3వేల రూపాయలు పించన్ ఇస్తామని చెప్పిన టిడిపిను కాదని వైఎస్సార్సీపీకీ ఒక్కఅవకాశం ఇచ్చి గెలిపించిన ప్రజలకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం మోసం చేసిందన్నారు
దీని ద్వారా ఒక్కో పించన్ దారుడు 60వేల రూపాయల నష్టాన్ని చవిచూసారవి చెప్పారు. వచ్చేఎన్నికలకు వెళ్ళేముందు 3వేల రూపాయలు పింఛన్లను జనవరి 2024నుండి ఇస్తామని ముఖ్యమంత్రి ప్రకటన చేయడం మోసం చేయడమేనని తెలిపారు. 2024సాదారణ ఎన్నికలకు
ఈఎన్నికలు సెమీ ఫైనల్ ఎన్నికలని, విజయం ఖాయమని చెప్పారు. అన్ని విధాలా వైఎస్సార్సీపీ ప్రభుత్వం వైపల్యం చెందినట్లు తెలిపారు. గత నాలుగేళ్లుగా ఎప్పుడూ మూడు రాజదానుల ప్రకటనలు చేస్తూ రాజదాని లేనిరాష్ట్రంగా ఆయన పరిపాలన చేసారని ఎద్దేవా చేశారు. రానున్న ఎన్నికల ముందు ప్రస్తుతం జరిగిన ఉత్తరాంధ్ర జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు, ఉత్తర, దక్షిణ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రభుత్వానికి చెంప చెళ్లుమనిపించినట్లని యువత తీర్పు చెప్పడం జరిగిందన్నారు. ప్రభుత్వంపై అన్ని వర్గాల వ్యతిరేకత దీనిద్వారా తెలిసిందన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎన్నో అక్రమాలకు పాల్పడ్డారని, సరైన సమయంలో సరైన నిర్ణయంను పట్టభద్రులు వెల్లడించారని చెప్పారు.2024లో జరగనున్న సాధారణ ఎన్నికల్లో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి కావడం ఖాయమని, టీడీపీ క్యాడర్ అంతా రానున్న ఎన్నికల్లో గెలుపుకు సైనికులు వలే పనిచేస్తారని తెలిపారు.
ఈకార్యక్రమంలో పార్టీ అధ్యక్షులు గుంట్రెడ్డి రవికుమార్, దొగ్గ మోహన్, కొల్లి తిరుపతిరావు, టీడీపి నాయకులు గర్భాపు ఉదయభాను, వాడాడ రాము,
గొట్టాపు వెంకటనాయుడు, తాతపూడి వెంకటరమణ, బడే గౌరునాయుడు, బోను దేవీచంద్ర మౌళి, రౌతువేణుగోపాల నాయుడు, రెడ్డి సింహాచలం,నారాయణరావు, కెంగువ సుధీర్, బంకపల్లి రవికుమార్, కోలా వెంకటరావు, సిరిపురపు భాస్కరరావు, తాన్న ప్రసాద్, గొంగాడ రామమూర్తి, జి. చంద్రమౌళి చందక దేశాలు, మరిశర్ల కార్తీక్, జాగాన రవిశంకర్ తదితరులు పాల్గొన్నారు,