Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

నిర్దేశించిన లక్ష్యాలను పూర్తిచేయాలి

జిల్లా కలెక్టర్ నిషాంట్ కుమార్

విశాలాంధ్ర – పార్వతీపురం : పార్వతీపురంటౌన్: నిర్దేశించిన లక్ష్యoమేరకు పనులు పూర్తి చేయాలని, లక్ష్యాన్ని చేరుకోని అధికారులపై తగు చర్యలు తీసుకొంటామని జిల్లాకలెక్టర్ నిశాంత్ కుమార్ అధికారులను హెచ్చరించారు.  ప్రభుత్వంప్రతిష్టాత్మకంగా చేపడుతున్న అభివృద్ధి పనుల లక్ష్యాలను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలన్నారు. సోమవారం అభివృద్ధి పనుల పురోగతిపై మండల స్థాయి అధికారులతో కలెక్టర్ కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్  నిర్వహించారు.జగనన్న కాలనీ ఇళ్ల నిర్మాణాలు, అమృత్ సరోవర్, భవనాల నిర్మాణం,  ఓటీస్, జాతీయ ఉపాధి హామీ పనులు, రీసర్వే, జల జీవన్ మిషన్, భూ సేకరణ, అభివృద్ధి పనుల పురోగతిపై మండలాల వారీగా సమీక్షించారు.ఇంటినిర్మాణం చేసుకొనే లబ్ధిదారులకు ప్రభుత్వ సహాయం పొందుటకు,  బ్యాంకు అకౌంట్స్ తెరుచుటకు అవసరమైన సహాయం, అవగాహన కల్పించాలని తెలిపారు.  నూరుశాతం గ్రౌండింగ్ పూర్తి చేయాలని, నిర్మాణంలోగల 9190 ఐళ్లను డిసెంబర్ నాటికి పూర్తి చేయాలన్నారు.రీసర్వే ప్రక్రియ త్వరగా పూర్తిచేయాలని, లక్ష్యం మేరకు ప్రణాళిక ప్రకారం పనులు జరగాలని, ప్రతిరోజు రీసర్వేలో జరుగుచున్న పురోగతిని తెలియజేయాలన్నారు.నరేగా పనులలో ఆగష్టు 31నాటికి ప్లాంటేషన్ పనులు పూర్తిచేయాలని తెలిపారు.గ్రామాలలో జరుగుచున్న నాడు -నేడు పనులు, అంగన్వాడీ, సచివాలయాలు, రైతుభరోసా కేంద్రాలు, గ్రామ ఆరోగ్య కేంద్రాల  నిర్మాణపనుల పురోగతి, జలజీవన్ మిషన్  పనులు సమీక్షించి  లక్ష్యం మేరకు సకాలంలో నిర్మాణపనులను త్వరగా పూర్తిచేయాలని తెలిపారు.  అదనపు తరగతి గదులు, టాయిలెట్స్ పనులు సెప్టెంబర్ 7వ తేదికల్లా నూరుశాతం గ్రౌండింగ్ చేసి  పూర్తి చేయాలన్నారు.
జాయింట్ కలెక్టరు ఒ.ఆనంద్ సమీక్ష చేస్తూ  రీ సర్వే పనులు మందకొడిగా సాగుతున్నాయని, లక్ష్యంప్రకారం ఏరోజు పనులు ఆరోజు పూర్తి చేయాలన్నారు.   మ్యుటేషన్ అప్లికేషన్స్  కాలపరిమితి దాటకుండా పరిష్కరించాలని తెలిపారు. 
ఈకార్యక్రమంలో  సబ్ కలెక్టర్ భావన, జిల్లా నీటియాజమాన్య సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ కె.రామచంద్ర రావు, గ్రామీణ నీటి సరఫరా విభాగం ఈ ఈ ప్రభాకర్, జిల్లా పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్ అధికారి ఎం.వి.జి.కృష్ణాజీ, జిల్లా గిరిజన సంక్షేమ ఇంజనీరింగ్ అధికారి జె.శాంతీశ్వరరావు, జిల్లా పంచాయితి అధికారి బలివాడ సత్యనారాయణ, జిల్లా విద్యాశాఖ అదికారి బ్రహ్మాజీ తదితర అధికారులు పాల్గొన్నారు. 

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img