Friday, October 7, 2022
Friday, October 7, 2022

శ్రీకాకుళం జిల్లా సమగ్ర అభివృద్ధి పాలకులు పాటుపడాలి

ఏఐవైఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎమ్. యుగంధర్

విశాలాంధ్ర -శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లా ని అభివృద్ధి పథంలో నడిపించాలని, జిల్లా సమగ్ర అభివృద్ధి కి పాలకులు పాటుపడాలి అని ఏ ఐ వై ఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎమ్.యుగంధర్ కోరారు. స్థానిక ఎన్ అర్ దాసరి క్రాంతి భవన్ లో మంగళ వారం జరిగిన విలేకరుల సమావేశంలో యుగంధర్ మాట్లాడుతూ రాష్ట్రంలో జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చి మూడు సంవత్సరాలు పైబడిన ఇంతవరకు వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయకుండా కాలయాపన చేస్తున్నారు. ఆనాడు పాదయాత్రలో యువతకు హామీ ఇచ్చి నేనున్నాను- నేను విన్నాను అని యువతకు ఆదుకుంటానని హామీ ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి ఈరోజు నిరుద్యోగులను గాలికి వదిలేశారు అని, తక్షణమే నూతన జాబ్ క్యాలెండర్ ను విడుదల చేసి నిరుద్యోగ యువతను ఆదుకోవాలని, శ్రీకాకుళం జిల్లాలో నూతన పరిశ్రమలు ఏర్పాటు చేసి స్థానిక యువతకు 70% ఉపాధి అవకాశాలను కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేనియెడల అఖిలభారత యువజన సమాఖ్య(ఏ ఐ వై ఎఫ్) తరపున రానున్న రోజుల్లో నిరుద్యోగ యువత అందరినీ కలుపుకొని జిల్లా వ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామన్నారు. జిల్లా నుంచి వలసల నివారణకు పాలకులు కార్యాచరణ రూపొందించి, జిల్లాల్లో ఉపాధి మార్గాలు చూపాలి అని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏ ఐ వై ఎఫ్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు వై. మురళి, కే. శ్రీనివాసరావు లు పాల్గొన్నారు .

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img