Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

చట్టబద్ద గ్రామసభలు నిర్వహణ

విశాలాంధ్ర – సీతానగరం: మండలంలోని 18 గ్రామపంచాయితీలలో శుక్రవారం చట్టబద్ద గ్రామ సభలను నిర్వహించడం జరిగిందని ఎంపిడిఒ ఎం ఎల్ ఎన్ ప్రసాద్, ఈఓపిఆర్డీ కుమార్ వర్మలు తెలిపారు.
ఈఆర్థిక సంవత్సరంలో మొదటి గ్రామ సభని తెలిపారు. డా.బి.ఆర్.అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆయన చిత్ర పటానికి ముందుగా పూలమాలలు వేసి నివాళులర్పించారు.అనంతరం గ్రామ సభలు ఏర్పాటు చేశారు. 18గ్రామ పంచాయతీలలోను గ్రామసర్పంచులు అధ్యక్షతన సమావేశాలను పంచాయతీ కార్యదర్శులు నిర్వహించారు.ఈసమావేసాల్లో ఆయా పంచాయతీల ఎంపీటీసీలు, వార్డు సభ్యులు, సచివాలయం సిబ్బంది,గ్రామస్తులు పాల్గొన్నారు.మండల స్థాయిఅధికారులైన ఎంపిడిఓ, ఈఓపిఆర్డీ, ఉపాధి హామీపథకం ఏపిఓ, మండల వ్యవసాయధికారి, మండల విద్యా శాఖాధికారి, ఆర్ డబ్ల్యు ఎస్ జేఈ, వెలుగు ఏపిఎం, గృహ నిర్మాణశాఖ ఏఈల పర్యవేక్షణలో గ్రామపంచాయతీ కార్యదర్శులు కన్వీనర్లుగా ఉండి సమావేశాలను నిర్వహించారు.పంచాయతీలో 29 శాఖల ద్వారాఅమలుజరుగుతున్న వివిధ అభివృద్ధి కార్యక్రమాలను, సంక్షేమ పథకాలను, పంచాయతీలో చేపడుతున్న అభివృద్ధి పనులను వివరించారు.73, 74రాజ్యాంగ సవరణల ద్వారా గ్రామ పంచాయతీల హక్కులు, విధులు వివరించారు. శుక్రవారంనాడు జోగమ్మ పేట, పాపమ్మవలస, బక్కుపేట, తామర ఖండి, పెదభోగిలి, చినబోగిలి, సూరమ్మ పేట, గెడ్డలుప్పి, కొత్తవలస, కృష్ణరాయపురం, పెదంకలం, లక్ష్మిపురం, చెళ్లంనాయుడువలస, వెంకటపురం, చినఅంకలం, యస్ యస్ పురం గ్రామ పంచాయతీల్లో గ్రామ సభలను నిర్వహించారు. మిగిలిన 17గ్రామ పంచాయితీలో సోమవారం నిర్వహిస్తామని అధికారులు తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img