
విశాలాంధ్ర – పార్వతీపురం : పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో జిల్లా కార్యాలయాల సముదాయానికి ఎదురుగా, ఆర్టీసి కాంప్లెక్స్ కు దగ్గరలో ప్రధాన కూడలి వద్ద కొత్తగా ఏర్పాటు చేసిన దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి 10అడుగుల విగ్రహావిష్కరణను భారీజనాలమధ్య రాష్ట్ర ఉప-ముఖ్యమంత్రి పీడిక రాజన్నదొర, జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు శత్రుచర్ల పరీక్షిత్ రాజు పార్వతీపురం ఎమ్మెల్యే అలజింగి జోగారావులు చేపట్టారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి సందర్భంగా పార్వతీపురం ఎమ్మెల్యే జోగారావు ఆద్వర్యంలో శనివారంనాడు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆయన విగ్రహానికి గజమాలను వేసి నివాళులర్పించారు.ఉమ్మడిరాష్ట్రానికి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చేసిన సేవలను, ఆయన అమలు చేసిన సంక్షేమ పథకాలను వారంతా కొనియాడారు. తండ్రికి తగ్గ తనయుడిగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పార్టీలకు అతీతంగా అమలుచేస్తున్న సంక్షేమ పథకాలను, అభివృధ్ధి ఫలాలను వివరించారు. ఈకార్యక్రమంలో నియోజక పరిశీలకులు శోభా హైమావతి జిల్లా వువసాయ సలహా మండలి ఛైర్మన్ వాకాడ నాగేశ్వరరావు,పార్వతీపురం నియోజక వర్గంలోని ప్రజాప్రతినిధులు, వైఎస్సార్సీపీ నాయకులు,అభిమానులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఎమ్మెల్యే జోగారావు పెద్దఎత్తున జనసమీకరణ చేయడంతో ఆరువేల మందికి పైగా జనాలు తరలిరావడంతో వచ్చిననేతలు ఆశ్చర్యపోయారు. ఆవిష్కరనంతరం ఒక్కసారి వర్షంరావడంతో రాజశేఖరరెడ్డి కార్యక్రమం అంతేనే వరుణ దేవుడు ఆశీస్సుల ఉంటాయని అక్కడనేతలు, అభిమానులు, కార్యకర్తలు అనుకోవడం గమనార్హం.