యూనియన్ బ్యాంక్ రీజనల్ హెడ్ ఎంవీ తిలక్
విశాలాంధ్ర – శ్రీకాకుళం టౌన్: మహిళా సాధికారత ద్వారా ప్రతీ కుటుంబం, దేశ అభివృద్ది జరుగుతుందని యూనియన్ బ్యాంక్ రీజనల్ హెడ్ ఎంవీ తిలక్ అన్నారు. మార్చి 8 న మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని వివిధ కార్యక్రమాల్లో భాగంగా యూనియన్ బ్యాంక్ సిబ్బంది ఎంపవర్ హర్ నినాదం తో మంగళవారం డే అండ్ నైట్ కూడలి నుంచి ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్బంగా తిలక్ మాట్లాడుతూ యూనియన్ బ్యాంక్ పిలుపు మేరకు ఈ కార్యక్రమం నిర్వహించాం అని, 6 వ తేదీ న ఉచిత వైద్య శిబిరం, 7 వ తేదీ న మహిళా సమావేశం నిర్వహించి జిల్లాలో వివిధ రంగాల్లో మహిళా ప్రముఖులకు సన్మానం నిరచిస్తామన్నారు. నవ సమాజ నిర్మాణం లో బెటీ బచావో… బెటీ పడావ్.. అనే నినాదం తో యూనియన్ బ్యాంక్ భాగస్వామ్యం అవుతుందన్నారు. మహిళల కు గౌరవ భావం తో చూసి అన్ని రంగాల్లో వారు మరింత అభివృద్ది చెందేలా ప్రతీ ఒక్కరూ మహిళలకు ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమం లో డిప్యూటీ రీజనల్ హెడ్ లు, చీఫ్ మేనేజర్ లు, ఇందిరా ప్రియదర్శిని, స్వర్ణ శ్రీ, యూనియన్ బ్యాంక్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.