Friday, April 19, 2024
Friday, April 19, 2024

మరో కోటి 50లక్షలను జమచేసిన ధాత్రి రియల్ ఎస్టేట్ సంస్థ

విశాలాంధ్ర, సీతానగరం: ఎన్ సి ఎస్ చక్కెర కర్మాగార భూములను ఆర్ ఆర్ యాక్టు ద్వారా వేలంపాట పాడిన ధాత్రి రియల్ ఎస్టేట్ సంస్థ సోమవారంనాడు మరో కోటి50లక్షల రూపాయలను తహశీల్దార్, ఏసిసి ఉమ్మడిఖాతాలో జమ చేశారు. వారు చెల్లింపుచేయాల్సిన 20కోట్ల 5లక్షల రూపాయలకుగాను ఇంతవరకు 19కోట్లరూపాయలు చెల్లింపు చేశామని సంస్థ ప్రతినిధి పోలవెంకట రమణ (తాతబాబు )తెలిపారు. మిగిలిన కోటిరూపాయలను మంగళవారంనాడు జమచేస్తామని తెలిపారు. కర్మాగారపరిధిలో ఎన్ సి ఎస్ యాజమాన్యం గతంలో 16.65కోట్లరూపాయలు బకాయిలు ఉండగా ఎన్ సి ఎస్ భూముల వేలం పాట జరిగిన సంగతి తెలిసిందే. వీటి అమ్మకంద్వారా వచ్చినడబ్బులలో ఇంతవరకు దూ.12.75కోట్ల రూపాయలు చెల్లించగా, 11వందలమంది చెరకు రైతులకు చెల్లింపుచేయాల్సిన మిగులు బకాయిలు 3కోట్ల 87లక్షలరూపాయలు చెల్లింపుకు జిల్లా కలక్టర్ ఆమోదం కోసం ప్రతిపాదనలు పంపామని చెప్పారు.అక్కడనుండి ఆమోద ఉత్తర్వులు వచ్చిన క్షణంలోనే చెల్లింపులకు సంబంధించి ప్రక్రియ నిర్వహిస్తామని చెప్పారు.దీనికి సంబంధించి ఆన్నిఏర్పాట్లు కూడా పూర్తి చేయడం జరిగిందని కూడా ఆయన తెలిపారు. ఇదిలాఉండగా వేలంపాటలో పాడిన భూములను డబ్బులు పూర్తిగా చెల్లింపు చేసాకా రెవెన్యూ అధికారులు రిజిస్ట్రేషన్ ప్రక్రియ చేయనున్నారని తెలుస్తోంది. ఈవారంరోజుల్లోనే ఈప్రక్రియ పూర్తి చేయడం జరుగుతుందని సమాచారం. ఏదిఏమైనా రైతులు, రైతు సంఘాలు, వివిధరాజకీయపార్టీల పోరాటాలు,నిరసనలు,ఆందోళనలు, ధర్నాలు పలితంగా ఈచెరకు బకాయిలు రైతులకు అందాయని స్పష్టంగా చెప్పవచ్చు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img