Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

డ్వామా పిడిగా బాధ్యతలు చేపట్టిన చిట్టి రాజు

విశాలాంధ్ర -శ్రీకాకుళం:. జిల్లా నీటి యాజమాన్య సంస్థ నూతన పథక సంచాలకులుగా చిట్టి రాజు మంగళవారం పదవీ బాధ్యతలు చేపట్టారు. ఎంపీడీవో గా విధులు నిర్వహించిన ఈయన పదోన్నతిపై డ్వామా పిడిగా జిల్లాకు వచ్చారు. గతంలో నరసన్నపేట ఎంపీడీవోగా కూడా ఈయన విధులు నిర్వహించారు. ముందుగా కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ ను మర్యాదపూర్వకంగా కలసిన ఈయన అనంతరం జిల్లా నీటి యాజమాన్య సంస్థ కార్యాలయానికి చేరుకుని తన బాధ్యతలను చేపట్టారు. ఈ సందర్భంగా సిబ్బంది ఆయనకు పుష్పగుచ్చాలను ఇచ్చి ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పిడి చిట్టి రాజు సిబ్బందిని ఉద్దేశించి మాట్లాడుతూ, జిల్లాలో ఉపాధి హామీ పథకం విజయవంతంగా అమలు చేసేందుకు గాను సిబ్బంది అందరూ తమ వంతు సహాయ సహకారాలు అందించాలని కోరారు. గ్రామాల్లో ఆర్థిక అసమానతలు రూపుమాపాలన్న ప్రధానలక్ష్యంతో అమలు చేయబడుతున్న ఈ పథకం పట్ల తనకు ప్రత్యేక శ్రద్ధ ఉందని ఆయన స్పష్టం చేశారు. వలసల నివారణ, జాబ్ కార్డ్ ఉన్నవారందరికీ ఉపాధిని చూపించడమే ప్రధమ కర్తవ్యం గా సిబ్బంది భావించి విధులు నిర్వహించాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. ప్లాంటేషన్ పనులను అన్ని మండలాల్లోనూ సత్వరం పూర్తి చేయాలని ఆదేశించారు. పైలట్ ప్రాజెక్టుగా జిల్లాలో చేపడుతున్న అమృత్ సరోవర్ చెరువు అభివృద్ధి పనులను కూడా వేగవంతంగా పూర్తి చేయాలన్నారు. ఈ సమావేశంలో ఏపీడీలు వాసుదేవరావు, లవరాజు, జయరాం, డిబిటి మేనేజర్ విజయవాణి, సూపరింటెండెంట్ ప్రసాద్ ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img