Monday, March 27, 2023
Monday, March 27, 2023

ప్రతీఎకరాకు సాగునీరు నీరందించే చర్యలు తీసుకోవాలి

వ్యవసాయానికి అధికప్రాధాన్యత నివ్వాలి
తోటపల్లి ప్రోజెక్టుపై సంతృప్తి వ్యక్తం చేసిన సీపీఐ రాష్ట్రబృందం

విశాలాంధ్ర, పార్వతీపురం/బెలగాం: రాష్ట్రంలోని ప్రతీ ఎకరాభూమికి సాగునీరు అందించే చర్యలు ప్రభుత్వమే చేపట్టాలని,వ్యవసాయానికి అధిక ప్రాధాన్యతనివ్వాలని, రాష్ట్రంలోని
ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తి చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ డిమాండ్ చేశారు. మంగళవారం
గరుగుబిల్లి మండలంలోని తోటపల్లి బ్యారేజి, ఎడమకాలువలను ఆయనతో పాటు రాష్ట్ర సిపిఐ కార్యవర్గం నాయకులతో కలిసి సందర్శన చేశారు.ముందుగా ప్రోజెక్టు వివరాలు, సాగు విస్తీర్ణం, నిధుల కేటాయింపు తదితర అంశాలపై తోటపల్లి ప్రోజెక్టు డిఈ రఘునాధనాయుడు, ఏఈ కిషోర్ లు మ్యాప్ చూపించి వివరించారు. మూడు జిల్లాల్లో సాగునీరు అందించే సామర్థ్యం కలిగిన తోటపల్లి ప్రోజెక్టుపై సంతృప్తి వ్యక్తం చేశారు. కుడి కాలువ ద్వారా 117 కిలో మీటర్ల పొడవున కాలువలు ఏర్పాటు చేశామని, దీనిద్వారా లక్షా31వేయి
ఎకరాలకు సాగునీరు అందించాల్సి ఉండగా ఇంతవరకు 82వేల ఎకరాలకు నీరు అందించిన ప్రభుత్వము మిగిలిన 50వేలఎకరాలకు కూడా నీరందించే చర్యలు త్వరితగతిన ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈనెల 13న తుంగభద్ర డ్యాంనుంచి ప్రాజెక్టుల సందర్శన ప్రారంభం చేశామని విజయవాడ వెళ్ళాక ఇరిగేషన్ నిపుణులు, అన్ని రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహించి ప్రాజెక్టులు పనితీరు, సాగునీరు, సందర్శనలో వెలుగులోకి వచ్చిన అంశాలు చర్చిస్తామని తెలిపారు.
ఎమ్మెల్సీల సామాజిక న్యాయం గూర్చి ప్రశ్నించగా జగన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం బాగుందని, బిసిలకు పెద్దపీట వేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఇదే సమయంలో వారికి కీలకమైన అధికారాలు ఇవ్వాలన్నారు.ఈబృందంలో రాష్ట్ర సహాయ కార్యదర్శులు ముప్పాళ్ళ నాగేశ్వరరావు, జేవీ సత్యన్నారాయణ మూర్తి, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జి. ఓబులేసు, అక్కినేని వనజ, జి. ఈశ్వరయ్య, డేగా ప్రభాకర్, రాష్ట్ర కంట్రోల్ కమిషన్ చైర్మెన్ పీ.కామేశ్వర రావు, ఆంధ్ర ప్రదేశ్ మహిళా సమాఖ్య రాష్ట్ర వర్కింగ్ ప్రసిడెంట్ ఏ. విమలలతో పాటు సీపీఐ మన్యం జిల్లా కార్యదర్శి కె మన్మథరావు, సహాయ కార్యదర్శి జీవన్, కార్యవర్గ సభ్యులు ఈవి నాయుడు, సూరయ్య, బుడితి అప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు.
మాజీ ఎమ్మెల్సీ, టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి ద్వారపురెడ్డి జగదీశ్ ఇంటికి వెళ్లి కొద్దిసేపు రాష్ట్ర రాజకీయాలు, ఎమ్మెల్సీ ఎన్నికలు గూర్చి ముచ్చటించారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామక్రష్ణను జగదీష్, టిడిపి నాయకులు కలిసి సత్కరించారు.ఈకార్యక్రమంలోమాజీ మున్సిపల్ చైర్ పర్సన్ ద్వారపురెడ్డి శ్రీదేవి,టీడీపీ నేతలు జి.రవికుమార్, కొల్లి తిరుపతిరావు, కోలవెంకటరావు, అక్కేన శ్రీను తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img