Wednesday, April 17, 2024
Wednesday, April 17, 2024

చ‌దువే గొప్ప ఆస్తి

జెడ్‌పి ఛైర్మ‌న్ మ‌జ్జి శ్రీ‌నివాస‌రావు

విశాలాంధ్ర విజ‌య‌న‌గ‌రం ః
చ‌దువే పిల్ల‌ల‌కు మ‌న‌మిచ్చే గొప్ప ఆస్తి అని జిల్లా ప‌రిష‌త్ చైర్‌ప‌ర్స‌న్ మ‌జ్జి శ్రీ‌నివాస‌రావు పేర్కొన్నారు. బాప‌ట్ల నుంచి రాష్ట్ర ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహన‌రెడ్డి విద్యాదీవెన సొమ్మును, విద్యార్థుల‌ త‌ల్లుల ఖాతాల‌కు జ‌మ చేశారు. ఈ కార్య‌క్ర‌మాన్ని జిల్లా క‌లెక్ట‌ర్ ఎ.సూర్య‌కుమారితో క‌లిసి క‌లెక్ట‌రేట్ ఆడిటోరియంలో లైవ్ టెలికాస్ట్ ద్వారా తిలకించిన అనంత‌రం, జెడ్‌పి ఛైర్మ‌న్ మీడియాతో మాట్లాడారు. పేదరికం కార‌ణంగా ఏ ఒక్క విద్యార్ధీ చదువుకు దూరం కాకూడ‌ద‌న్న ఉద్దేశంతో, అమ్మ ఒడి, జ‌గ‌న‌న్న విద్యాదీవెన‌, వ‌స‌తి దీవెన‌, జ‌గ‌న‌న్న గోరుముద్ద‌, విద్యా కానుక లాంటి ప‌థ‌కాల‌ను అమ‌లు చేస్తున్నార‌ని అన్నారు. ప్ర‌తీ మూడు నెల‌ల‌కు ఒక‌సారి నేరుగా త‌ల్లుల ఖాతాల్లో ఫీజుల‌ను జ‌మ‌చేస్తూ, విద్యార్థుల‌కు సిఎం అండ‌గా నిలుస్తున్నార‌ని కొనియాడారు.
విద్యాదీవెన క్రింద‌ జిల్లాకు చెందిన 50,276 మంది త‌ల్లుల‌కు, ఏప్రెల్‌, మే, జూన్ నెల‌ల ఫీజుల‌కు సంబంధించి, రూ.26కోట్ల‌, 85ల‌క్ష‌ల‌, 72వేల‌, 408 ను జ‌మ చేశారు. వీరిలో బిసి విద్యార్థులు 40,569 మంది, ఎస్‌సిలు 4,821, ఈబిసిలు 2,835, కాపు విద్యార్థులు 1,006, ఎస్‌టిలు 760, ముస్లింలు 245, క్రిష్టియ‌న్లు 40 మంది ఉన్నారు. ఈ కార్య‌క్ర‌మాన్ని క‌లెక్ట‌రేట్ ఆడిటోరియంలో ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం ద్వారా తిల‌కించారు. అనంత‌రం విద్యాదీవెన‌కు సంబంధించిన చెక్కును క‌లెక్ట‌రేట్ ఆడిటోరియంలో జిల్లా క‌లెక్ట‌ర్ ఎ.సూర్య‌కుమారి, జెడ్‌పి ఛైర్మ‌న్ మ‌జ్జి శ్రీ‌నివాస‌రావు, మేయ‌ర్ వెంప‌డాపు విజ‌య‌ల‌క్ష్మి, ల‌బ్దిదారుల‌కు అంద‌జేశారు. ఈ కార్య‌క్ర‌మంలో డిప్యుటీ మేయ‌ర్లు కోల‌గ‌ట్ల శ్రావ‌ణి, ఇస‌ర‌పు రేవ‌తీదేవి, జిల్లా షెడ్యూల్ కులాల సంక్షేమ‌, సాధికార‌తాధికారి పి.ర‌త్నం, ఇత‌ర అధికారులు, విద్యార్థులు, వారి త‌ల్లితండ్రులు, సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img