Thursday, March 23, 2023
Thursday, March 23, 2023

ఎన్నికలు స్వేచ్ఛగా, పగడ్బందీగా నిర్వహించాలి

జిల్లా కలెక్టర్


విశాలాంధ్ర,పార్వతీపురం: జిల్లాలో శాసన మండలి పట్టభద్రుల ఎన్నికలు స్వేచ్ఛగా, పగడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ అన్నారు. స్థానిక కలెక్టర్ కార్యాలయం నుండి సూపరిండెంట్ ఆఫ్ పోలీస్ వి.విద్యా సాగర్ నాయుడు తో కలసి ఎమ్ ఎల్ సి ఎన్నికల నిర్వహణకు తీసుకోవలసిన జాగ్రత్తలపై డివిజన్, మండలస్థాయి అధికారులతో గురువారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈసందర్భంగా ఆయనమాట్లాడుతూ ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ప్రతీ ఒక్కరూ ఎన్నికల ప్రవర్తనా నియమావళిని తూచా తప్పకుండా పాటించాలని, గత నెల 9వ తేదీన ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులోకి వచ్చిందన్నారు. 12వ తేదీన స్థానిక కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన రిసెప్షన్ కేంద్రంలో డివిజన్, మండల స్థాయి అధికారులు సమన్వయంతో అధికారులకు ఎన్నికల సామాగ్రిని పంపిణీ చేయాలని అన్నారు. ఐదు రూటు లకు గాను ఐదుగురు రూట్ అధికారులు సెక్టార్ అధికారులకు నియమించినట్లు తెలిపారు. ఎన్నికల విధుల్లో ఎటువంటి నిర్లక్ష్యాన్ని, బాధ్యతారాహిత్యాన్ని ప్రదర్శించిన నిబంధన మేరకు చర్యలు తప్పని హెచ్చరించారు. మద్యం దుకాణాల్లో అధికంగా మద్యం అమ్మకాలు జరగకుండా, ఓటర్లు ప్రలోభాలకు గురికాకుండా నిఘా పెట్టాలని సూచించారు. అభ్యర్థులు మార్చి 11వ తేదీ సాయంత్రం నాలుగు గంటల తర్వాత ప్రచార కార్యక్రమాలు నిర్వహించరాదని వెల్లడించారు. పోలింగ్ కేంద్రంలో పోటీ చేసే అభ్యర్ధి మినహా ఎవరిని ఎన్నికల ప్రవర్తనా నియమావళి ప్రకారం అనుమతించ రాదని తెలిపారు. పోలింగ్ కేంద్రానికి వంద మీటర్ల దూరంలో వాహనాలను నిలుపుదల చేయాలని చెప్పారు. వాహనాలతో ర్యాలీగా బయలుదేరి రావడం, సభలు నిర్వహించడం వంటివాటికి అనుమతించ వద్దని స్పష్టం చేశారు. యువత ప్రలోభాలకు గురై వాహనాల్లో గ్రూపులుగా ప్రయాణించి ప్రమాదాలకుగురయ్యే అవకాశం ఉన్నందున అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని అన్నారు. ఓటు వేసేందుకు రాలేని పరిస్థితిలో ఉన్న ప్రాంతాలకు వాహన సౌకర్యం కల్పిస్తామని చెప్పారు. పటిష్టమైన భద్రతకు తాసిల్దారులు, సబ్ ఇన్స్పెక్టర్లు ఏర్పాట్లు చేపట్టాలన్నారు. జిల్లా లోని 15 మండలాల్లో 24 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయగా, అర్హులైన పట్టభద్రుల ఓటర్లు 18,520 మంది ఉన్నారన్నారు. మండల పరిధిలోని బూత్ స్థాయి అధికారులతో పట్టభద్రుల ఓటరు జాబితా ప్రకారం అర్హులైన ఓటర్లకు ఇన్ఫర్మేషన్ స్లిప్ లను పంపిణీ చేస్తున్నామని వెల్లడించారు. ఓటరు స్లిప్ ల పంపిణీ ప్రక్రియ 8వ తేదీతో పూర్తి చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ నెల 13 తేదీన ఉదయం గం.8 ల నుండి సాయంత్రం గం.4 ల వరకు పోలింగ్ జరగనున్నట్లు చెప్పారు. పోలింగ్ ముగిసే సమయానికి క్యూలో ఉన్న ఓటర్లకు చివరి ఓటరు నుండి స్లిప్ లు జారీచేసి అనుమతించాలని అన్నారు. ప్రతీ పోలింగ్ కేంద్రం బయట ఓటు హక్కు వినియోగించుకునే విధానంలో ఓటు ఎలా వేయాలి, ఏమి చేయకూడదు అనే విషయాలను అవగాహన ఫ్లెక్సీ లు ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు మండల స్థాయి లో వివిధ రాజకీయ పార్టీల నాయకులతో సమావేశాలు నిర్వహించాలని ఆదేశించారు.సూపరిండెంట్ ఆఫ్ పోలీస్ వి. విద్యాసాగర్ నాయుడు మాట్లాడుతూ ఎనిమిది సున్నితమైన పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని పటిష్ట బందో బస్తును ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. పోలింగ్ కేంద్రాల పరిధిలో 144 సెక్షన్ కఠినంగా అమలులో ఉంటుందని స్పష్టం చేశారు. బల్క్ గా మద్యం అమ్మకాలు జరగకుండా, బెల్ట్ షాపులు నిర్వహణ లేకుండా ప్రత్యేక పర్యవేక్షణ చేపట్టాలని ఆదేశించారు. పోలింగ్ కేంద్రాల నుండి 100 మీటర్ల ముందు వాహనాల నిలుపుదల చేసేలా ఆ ప్రాంతంలో సూచనలు, నిబంధనలు తెలుపుతూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.ఈకార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి వెంకటరావు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img