Tuesday, October 4, 2022
Tuesday, October 4, 2022

త్వరితగతిన భవనాలను పూర్తి చేయడంపై దృష్టి పెట్టాలి

ఎంపిడిఓ కృష్ణ మహేష్ రెడ్డి పిలుపు

విశాలాంధ్ర,సీతానగరం:గ్రామాల్లో మౌలిక వసతులు, సదుపాయాలు కల్పనలో భాగంగా ప్రభుత్వం నిర్మిస్తున్న సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, వెల్ నెస్ కేంద్రాల భవనాలు త్వరితగతిన నిర్మాణాలు పూర్తి జరిగేలా గ్రామ పంచాయతీ కార్యదర్శిలు ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలని ఎంపిడిఓ బి. కృష్ణ మహేష్ రెడ్డి పిలుునిచ్చారు.బుదవారం స్తానిక మండల పరిషత్తు కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శులతో సమీక్ష సమావేశంను నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ సెప్టెంబరు15 నుండి అక్టోబర్ ,2వరకు జరగబోవు స్వచ్ఛతా హై సేవా కార్యక్రమాలలో భాగంగా ప్రభుత్వం జారీచేసిన దినవారీ కార్యక్రమాలను తూచా తప్పకుండా నిర్వహించాలని కోరారు.అన్ని గ్రామాలలో పారిశుద్ధ్య నివారణ కార్యక్రమాలు నిర్వహించి దానిద్వారా అంటువ్యాధులు రాకుండా చర్యలను చేపట్టాలన్నారు  ఇంటి పన్నుల వసూలుకు కూడా తగుచర్యలు తీసుకోవాలని ఆదేశించారు. చెత్త సంపద కేంద్రాలను కూడా తొందరగా నిర్మాణాలు పూర్తి జరిగేలా చూడాలన్నారు.సచివాలయాల ద్వారా మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేయాలని కోరారు. గ్రామపరిపాలనలో
ఏవిధమైన అవాంతరాలు లేకుండా ప్రజలకు సచివాలయ సిబ్బంది అందుబాటులో వుండాలన్నారు. లేనిచో తగు చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. స్పందన ఫిర్యాదులను దరఖాస్తుదారులతో స్వయంగా మాటాడి పరిష్కారం చూపి ఆన్‌లైన్ లో పరిష్కారం చూపడం ద్వారా ఫిర్యాదులను తగ్గించేందుకు ఉపయోగపడుతుందని సూచించారు.సిబ్బందికి ఉండే సమస్యలను తన దృష్టికి తెస్తే పరిష్కారం చేస్తానని తెలిపారు. అర్హులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించేందుకు దృష్టి పెట్టాలని కోరారు. సచివాలయాల్లో అన్ని శాఖల సిబ్బంది సమన్వయంతో పనిచేయాలన్నారు.గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో వచ్చిన వినతులను తప్పనిసరిగా నమోదుచేసి ఉంచాలని కోరారు. గ్రామపంచాయితీల్లో చేయాల్సిన పలుఅంశాలపై మండల పంచాయితీ విస్తరణ అధికారి వర్మ వివరించారు. గ్రామాల్లో కాలువల్లో పూడిక తీసే చర్యలు చేపట్టాలని ఆయన తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img