Friday, April 19, 2024
Friday, April 19, 2024

ఎరుపెక్కిన మన్యం జిల్లా కేంద్రం

ధాన్యం కొనుగోలులో ప్రభుత్వ ఆదేశాలను తూ.చ.తప్పకుండా అమలు చేయాలి
*జంబ్లింగు  విధానాన్ని రద్దుచేయాలి
*దళారుల, మిల్లర్లు దోపిడీనుండి రైతులను కాపాడాలి:
రైతు, రైతుకూలీసంఘాల సమన్వయ సమితి నేతల డిమాండ్

విశాలాంధ్ర, పార్వతీపురం: ధాన్యం కొనుగోలును రైతు భరోసా కేంద్రాల ద్వారానే కోనుగోలు చేయాలని, ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకే కోనుగోలు చేయాలని, జంబ్లింగు విధానాన్ని రద్దు చేయాలని, దళారుల, మిల్లర్ల దోపిడీ నుండి రైతులను కాపాడాలని, పంటలకు కనీస మద్దతుధర చట్టాన్ని అమలు చేయాలని కోరుతూ ఆంధ్ర ప్రదేశ్ రైతు, రైతుకూలీసంఘాల సమన్వయ సమితి పార్వతీపురం మన్యంజిల్లా నేతలు డిమాండ్ చేశారు.శుక్రవారంనాడు పార్వతీపురం జిల్లా కేంద్రంలోని మార్కెట్ యార్డు నుంచి నాలుగు రోడ్లు,కాంప్లెక్స్, బెలగాం మీదుగా జిల్లా కలెక్టర్ కార్యాలయంవరకు పెద్దఎత్తున జెండాలుపట్టుకుని,రైతులకు మద్దతుగా నినాదాలు చేస్తూర్యాలీనిర్వహించారు. అనంతరం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. రైతులనుంచి 40కేజీల బస్తాకు అదనంగా తీసుకుంటున్న రెండున్నర కేజీల ధాన్యం విధానం రద్దు చేయాలని, జంబ్లింగు విధానాన్ని రద్దు చేసి స్వంత మండలంలోని మిల్లులకు ధాన్యాన్ని తరలించే ప్రక్రియ చేపట్టాలని వారు డిమాండ్ చేశారు. ధాన్యంబస్తాను మిల్లుదగ్గర దించడానికి రైతులు నుండి వసూలు చేస్తున్న ఐదురూపాయలు రద్దు చేయాలని డిమాండ్ చేశారు.ధాన్యాన్ని తరలించడానికి సకాలంలో వాహనాలు పంపించాలని, రైతు భరోసా కేంద్రాలను పూర్తిస్థాయిలో ప్రారంభంచేసి ఆన్ని సౌకర్యాలు అందేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గోనె సంచులు పెద్ద ఎత్తున అందజేయాలని,ధాన్యంకొనుగోలు చేసిన వెంటనే వాహనాలుద్వారా తరలించాలని కోరారు.రైతులనుండి రవాణా చార్జీలు, దింపుడు కూలీలు తదితర వాటిని రద్దు చేయాలని డిమాండ్ చేశారు.అనంతరం జిల్లా రెవెన్యూ అధికారి జే. వెంకటరావుకు వారంతా కలిసి ఆన్ని అంశాలను వివరించి ధాన్యంకొనుగోలులో  జరుగుతున్న అక్రమాలను నిరోధించి రైతులకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈకార్యక్రమంలో రైతు సంఘం జిల్లా కార్యదర్శి బుడితి అప్పలనాయుడు, సీపీఐ కార్యదర్శి కోరంగి మన్మధరావు, సహాయ కార్యదర్శి జీవన్, వివిధ సంఘాలకు చెందిన నేతలు కే. శ్రీనువాసనాయుడు, రెడ్డి లక్షున్నాయుడు, బొత్స నరసింగరావు, రెడ్డి వేణు, రంజిత్ కుమార్, ఉయ్యక ముత్యాలు, బంటు దాసు, జి అప్పల నాయుడు, డివినాయుడు, గేదెల సత్యనారాయణ, బాషా గరుగుబిల్లి సూరయ్య తదితరులు పాల్గొన్నారు.ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img