Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

రైతులు ఈపంటనమోదును త్వరితగతిన చేసుకోవాలి

విశాలాంధ్ర, పార్వతీపురం/ పార్వతీపురం రూరల్: పార్వతీపురం మండలంలోని  అన్ని రైతుభరోసా కేంద్రంలలోఉన్న వ్యవసాయ సహాయకులుద్వారా ఈపంట నమోదును రైతులు త్వరితగతిన చేసుకోవాలని  మండల వ్యవసాయాదికారి ఆర్ రేఖ తెలిపారు. బుదవారం ఆమెమండలములోని పలు గ్రామాలలో ఈపంట నమోదును పరిశీలించారు.రాష్ట్ర వ్యవసాయ కమీషనర్, జిల్లా కలెక్టర్ నిషాంత్ కుమార్, జిల్లా వ్యవసాయ శాఖాధికారి రాబర్ట్ పాల్ ఆదేశాలు మేరకు ఈ పంట నమోదు పై ప్రత్యేక శ్రద్ద తీసుకోవడం జరుగుతుందన్నారు.వ్యవసాయ సిబ్బందికి తగు సూచనలు ఇచ్చి వేగవంతం చేయాలని కోరారు.అనంతరంపలుగ్రామాల్లో వరిపంట సాగును కూడా పరిశీలించారు. అన్ని గ్రామాలలో రైతులు సెప్టెంబర్ 7లోగా ఈపంట నమోదు చేసుకోవాలని, ప్రతీ ఒక్కరూ పంటను ఎంతవిస్తీర్ణంలో వేసారో ఏపంటవేసారో తెలియజేసి పంటలను నమోదు చేసుకోవాలన్నారు. ఈపంట నమోదువలన ధాన్యం కొనుగోలు, ధాన్యం అమ్ముకోవడానికి, అలాగే ఉచితపంటలు బీమా మరియు పంట నష్ట పరిహారం జరిగిన సందర్భంలోఎంతో ఉపయోగంగా ఉంటుందన్నారు. ఎరువుల కొరత లేకుండా తగు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఆమెతోపాటు విఏఏ లు, రైతులు పాల్గొన్నారు. 

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img