Tuesday, April 16, 2024
Tuesday, April 16, 2024

మన్యంజిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం

ఆటోనుఢీకొన్న లారీ-ఐదుగురు మృతి
ఇద్దరు పరిస్థితి విషమం- మరో ఆరుగురికి గాయాలు

విశాలాంధ్ర,కొమరాడ/పార్వతీపురం: పార్వతీపురం మన్యం జిల్లాలో బుదవారం ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే నలుగురు మహిళలు మృతిచెందగా 108వాహనంలో జిల్లా ఆసుపత్రికి తీసుకొనివెళ్తుండగా ఒకరు మృతి చెందారు.మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో విశాఖపట్టణం తరలించారు. వివరాలు పరిశీలిస్తే మన్యం జిల్లాలోని కొమరాడ మండలంలో అంటివలస గ్రామానికి చెందినవారు ఇదే మండలంలోని తుమ్మలవలస గ్రామానికి శుభకార్యానికి ఆటోలో 13మంది కలిసి వెళ్ళారు.తిరుగు ప్రయాణంలో మండలంలోని చోల్లపథం మలుపు వద్ద రాష్ట్రీయ రహదారిపై పార్వతీపురం నుండి రాయగడ వైపు వెళ్తున్న లారీ ఆటోను బలంగా ఢీకొంది. దీంతో ఆటో నుజ్జయి ఆటోలో ప్రయాణిస్తున్న వారంతా రోడ్డుపై చెల్లా చెదురుగాపడి అక్కడికక్కడే నలుగురు మహిళలు మృత్యువాత పడ్డారు. మరోముగ్గురికి తలకు తీవ్ర గాయాలుకాగా ఇంకో ఆరుగురుకీ కూడా చిన్న చిన్న గాయాలు అయ్యాయి.క్షతగాత్రులందరినీ వెంటనే 108వాహనాల్లో పార్వతీపురం జిల్లా ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోఒకరుమృతిచెందగా మరోఇద్దరిపరిస్థితివిషమంగాఉండటంతో మెరుగైనవైద్యచికిత్స నిమిత్తం పార్వతీపురంజిల్లా ఆసుపత్రి నుంచి విశాఖపట్టణం రిఫర్ చేసినట్లు జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వాగ్దేవి చెప్పారు.మిగిలిన ఆరుగురికి చిన్న చిన్న గాయాలు కావడంతో వారికి జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని ఆమె చెప్పారు. ఈప్రమాదంలో వుయ్యక నరసమ్మ(40),వుయ్యక లక్ష్మి(42), మెల్లిక శారద (35),మెల్లిక అమ్మడమ్మ(40), ఉయ్యక వెంకటి (55) లు మృతిచెందగా, డ్రైవర్ వుయ్యక వెంకటేష్, వుయ్యక రామస్వామి ల పరిస్థితి విషమంగా ఉంది.ప్రమాదం జరిగిన వెంటనే సంఘటన జరిగిన స్థలానికి జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు, అదనపు ఎస్పీ డాక్టర్ దిలీప్ కిరణ్, సర్కిల్ ఇన్స్పెక్టర్ విజయానంద్ లు చేరుకొని మృత్త దేహాలను,క్షతగాత్రులను పార్వతీపురం తరలించే చర్యలు తీసుకున్నారు.ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. వారితో పాటు కొమరాడ పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.ఈప్రమాదంలో ఉయ్యకలక్ష్మి మృతి చెందగా ఆమెభర్త ఉయ్యక రామస్వామి పరిస్థితి కూడా విషమంగానే ఉంది. రెండేళ్ల చిన్నారికి మాత్రం ఎటువంటి గాయాలు తగలకపోవడం గమనార్హం.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img