Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

సిపిఐ కార్యాలయంలో జెండా పండగ

విశాలాంధ్ర – బెలగాం : సిపిఐ జిల్లా కార్యాలయంలో జిల్లా కార్యదర్శి కూరంగి మన్మధరావు ఆధ్వర్యంలో 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యాలయంలో ఆవరణలో జాతీయ జెండాను ఎగురవేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎందరో మహానుభావుల త్యాగ ఫలితంగా నేడు ఈ స్వాతంత్ర్య వేడుకలు జరుపుకొంటున్నామని, మరెందరో అమరజీవులయ్యారని నేడు వారిని తలచుకొంటూ వారికి ఘన నివాళులర్పించాలని అన్నారు. అనంతరం స్కూలు పిల్లలకు మిఠాయిలు పంచిపెట్టారు. కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఈవి నాయుడు, గరుగుబిల్లి సూరయ్య, జిల్లా సమితి సభ్యులు సింహాద్రి దుర్గారావు, సాలాపు అనంతరావు, అగ్రిగోల్డ్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు గెంబలి శ్రీనివాసరావు, సభ్యులు మారోజు వెంకటరావు తదితరులు పాల్గొన్నారు.

Attachments area

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img