Thursday, April 18, 2024
Thursday, April 18, 2024

కోన పాఠశాలలో ఫుడ్ పోయిజన్

అస్వస్థతకు గురయిన 34మంది విధ్యార్ధులు
అధికారుల స్పందనతో అంతాక్షేమమే

విశాలాంధ్ర,మక్కువ/పార్వతీపురం: మన్యంజిల్లాలో మక్కువ మండలంలోని కోన గ్రామంలోని మండల పరిషత్ పాఠశాలలో బుదవారం మధ్యాహ్నా భోజన పధకం వికటించి ఒక్కసారిగా 34మంది విధ్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఒక్కసారి అందరిలో ఆందోళన నెలకొంది.ఎక్కువమంది విధ్యార్ధులు వాంతులు చేసుకున్నారు. హుటాహుటిన తల్లిదండ్రులు పాటశాల వద్దకు చేరుకుని వారినిదగ్గరలో ఉండే శంబర, మక్కువ ప్రాధమిక అరోగ్య కేంద్రాలకు తరలించి వైద్య సహాయం అందజేసారు.ఉడికి ఉడకని ఆహారంతో పెట్టడంతోపాటు, నీటిలో కలుషితంతో చుట్టుపక్కల దయనీయ వాతావరణం వల్ల సంఘటన సంబవించినట్లు విధ్యార్ధులు, వారి తల్లిదండ్రులు తెలిపారు. హెచ్ ఎం నిర్లశ్యం స్పష్టంగా కనిపిస్తుందని,ఆయనను తక్షణమే సస్పెండ్ చేయాలని తల్లిదండ్రులు డిమాండ్ చేశారు.
విద్యార్థుల అస్వస్థతపై వెంటనే స్పందించిన జిల్లా కలెక్టర్:
కోనగ్రామంలోని పాఠశాలలో జరిగిన సంఘటన తెలుసుకున్న వెంటనే జిల్లా కలెక్టర్ నిషాంత్ కుమార్ తక్షణం స్పందించి వైద్య ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. విద్యార్థుల అస్వస్థతపై వెంటనే జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి, జిల్లా విద్యాశాఖ అధికారి, తహశీల్దార్ లను హుటాహుటిన పాఠశాలకు వెళ్లాలని ఆదేశించారు. జిల్లా కలెక్టర్ స్వయంగా వైద్యులతో మాట్లాడి విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్నారు. విద్యార్థుల పరిస్థితిపై తహశీల్దార్, ముగ్గురు వైద్య అధికారులను పంపించి ఆరాతీశారు పిల్లలు మధ్యాహ్నం ఆహారం తీసుకున్న అనంతరం అస్వస్థకు గురయ్యారని, అందరికీ వైద్య పరీక్షలు నిర్వహించి చికిత్సను సకాలంలో వైద్యులు అందించడం జరిగిందన్నారు. విధ్యార్ధులందరి ఆరోగ్య పరిస్థితి మెరుగు పడటంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. జిల్లావైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ బి.జగన్నాథరావు, ఇంచార్జి జిల్లా విద్యాశాఖ అధికారి పి.బ్రాహ్మాజీ రావు,తహశీల్దార్ సూర్యనారాయణ,ఎంపిడిఓ దేవ కుమార్, మండలవిద్యాశాఖాధికారి మల్లేశ్వరరావు, ఎస్ఐ పైడిరాజు తదితర అధికారులు ఘటనస్థలానికి చేరుకొని తగుచర్యలు తీసుకున్నారు.జిల్లా కలెక్టరు ఆదేశాలు మేరకు వైద్యపరీక్షలు నిర్వహించి చికిత్సలు నిర్వహించారు. ఐదు అంబులెన్స్ లను ఏర్పాటుచేసి ఎప్పటికప్పుడు జిల్లా కలెక్టర్ కు నివేదించారు. తీవ్రతలేదని,విద్యార్థులు క్షేమంగాఉన్నారని, ఎటువంటి భయాందోళనలకు గురికావాల్సిన అవసరం లేదని వైద్యులుచెప్పారు. జిల్లా యంత్రాంగం వెంటనే అప్రమత్తం కావడంతో విధ్యార్ధులు ప్రమాదంనుండి బయటపడ్డారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img