Tuesday, September 27, 2022
Tuesday, September 27, 2022

అప్పయ్యపేటలో ఉచిత కంటివైద్యసేవలు

విశాలాంధ్ర,సీతానగరం: పార్వతీపురం మన్యం జిల్లాలోని సీతానగరం మండలములోని
అప్పయ్యపేట గ్రామములో ఆదివారం నాడు ఉచిత కంటి నిర్వహించారు. శ్రీవెంకటేశ్వర పుష్పగిరి(విజయనగరం) ఆసుపత్రి అధ్వర్యంలో నిర్వహించిన శిభిరంద్వారా 50మందికి తనిఖీలు నిర్వహించారు.పలువురుకి కంటి శుక్లాలు ఆపరేషన్లు చేయడానికి వారు అంగీకారం చెప్పారు. ఈకార్యక్రమంలో ఎంపీటీసీ బురిడి సూర్యనారాయణ  ఆర్ఎంపి డాక్టర్ సబ్బాన సుధీర్ , గ్రామపెద్దలు పలువురు రోగులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా గ్రామములో జగనన్న ఇల్లునిర్మాణాలు శతశాతం చురుగ్గా పనులు జరుగుతున్నాయని ఎంపిటిసి సూర్యనారాయణ చెప్పారు. గ్రామంలో ఎమ్మెల్యే జోగారావు సహాకారంతో పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు జరుగుతున్నాయని తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img