Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

చినభోగిలి గ్రామపంచాయతీలో గడప గడపకు కార్యక్రమం

విశాలాంధ్ర,సీతానగరం: మండలంలోని చినభోగిలి గ్రామపంచాయితీలలో శని వారంనాడు గడప_గడపకు మనప్రభుత్వ కార్యక్రమం ఎమ్మెల్యే
అలజింగి జోగారావు ఆద్వర్యంలో జరిగింది. గడప గడపకు కార్యక్రమానికి ముందు పెద్దఎత్తున గ్రామస్తులు,నాయకులు, మహిళలు పాల్గొని ఎమ్మెల్యే జోగారావును మేళతాళాలతో, పువ్వులు జల్లుతూ పటాస్ సామాగ్రితో ఊరేగింపు నిర్వహించారు.అనంతరం గ్రామంలోగల డాక్టరు బి ఆర్ అంబేద్కర్ విగ్రహంకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. తరువాత గడప గడపకు కార్యక్రమాన్ని ప్రారంభించి ప్రతీలబ్దిదారునిఇంటికి అధికారులు, ప్రజా ప్రతినిధులు,సచివాలయఉద్యోగులు, వాలుంటీర్లుతో కలిసివెళ్ళి ప్రభుత్వం వారికి చేకూర్చిన ప్రయోజనాలను, గ్రామానికి చేసిన అభివృద్ధిని వివరించారు. వారి సమస్యలను అడిగితెలుసుకున్నారు. గతమూడున్నరఏళ్ల కాలంలో చేసిన అభివృద్ధి పనులు తెలియజేసి, ఇంకాఏమిచేయాలని అడుగుతూ ముందుకు సాగారు.ప్రతీ ఇంటివద్ద కుశల ప్రశ్నలను వేసి వారి సమస్యకు పరిష్కారాన్ని చూపడం గమనార్హం.ఇంతవరకు నియోజక వర్గంలో 34గ్రామసచివాలయాల్లో 88రోజులు పూర్తి చేశామని ఆయన తెలిపారు. దీనిద్వారా ప్రతీ గడపకు వెళ్లి వారి బాగోగులను తెలుసుకోవడంతోపాటు వారి సమస్యలు తెలుసుకోవడం జరుగుతుందన్నారు.అర్హులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలను ఖచ్ఛితంగా చేరాలన్న దానిని సచివాలయం సిబ్బంది అమలు చేయాలని కోరారు.ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు, తనకు రానున్న ఎన్నికల్లో ప్రజల ఆశీస్సులు అందజేయాలని కోరుతున్నారు.ఈకార్యక్రమంలో ఎంపిపి బలగ రవనమ్మ, జెడ్పీటీసీ బాబ్జి, నాయకులు బొంగు చిట్టిరాజు, శ్రీరాములునాయుడు, పోలఈశ్వర నారాయణ, వెంకటఅప్పలనాయుడు,ఆర్వీ, రత్నాకర్, సర్పంచులు కురమానరాధ శ్రీనివాసరావు, గుర్రాల బుజ్జి,వెంకటనాయుడు,రమేష్, చుక్క రాంబాబు,డేవిడ్,శాస్త్రి, ఎంపిడిఓ బికృష్ణమహేష్ రెడ్డి, తహశీల్దార్ ఎన్వీ రమణ, ఈఓపిఅర్డి వర్మ,ఏపిఓ నాగలక్ష్మి, గృహనిర్మాణ శాఖ జేఈ జానకీరాం, వెలుగు ఏపిఎం శ్రీరాములు, అర్ డబ్ల్యు ఎస్ జేఈ పవన్ కుమార్, ఎంఈఓ సూరిదేముడు, మండల వ్యవసాాయాధికారి అవినాష్, సచివాలయంసిబ్బంది, మండలప్రజా ప్రతినిధులు,నాయకులు, వాలంటీర్లు,
గ్రామస్తులు పెద్దఎత్తున పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img