Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

జీతాలు ఇవ్వండి మహాప్రభో!

విశాలాంధ్ర,పార్వతీపురం: ఎనిమిదోతేదీ ముగుస్తున్న అకౌంట్ లోజీతాలు ఇంకా చాలా మంది ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు పడలేదని ఎపి ఎన్జీఓ అసోసియేషన్ పార్వతీపురం మన్యం జిల్లా జెఎసి ఛైర్మన్ జివిఆర్ఎస్ కిషోర్ అన్నారు. బుధవారం ఆయనవిలేకరులతో మాట్లాడుతూ నేటివరకు జీతాలు రాకపోవడంతో పాలవాడు, ఇంటిఓనరు, కిరాణాషాపు చివరకు పనిమనుషులనుండి ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు తప్పించుకు తిరుగుతున్న పరిస్తితి ఏర్పడిందని చెప్పారు. ముఖహాజరు నమోదు చేసుకోకపోతే మెమోలాఇచ్చేఅధికారులు మరిజీతాలు ఆలస్యంచేసిన ప్రభుత్వానికి ఏమిచేయాలని ప్రశ్నించారు. జిల్లాలో రెగ్యులర్ ఉద్యోగులు, కాంట్రాక్టు ఉద్యోగులు, పెన్షనర్లు జీతాలకోసం పడిగాపులుకాస్తున్నారని, అసలు ప్రభుత్వానికి పాలించే హక్కుఉందా అని ప్రశ్నించారు. సుమారు మూడున్నర ఏళ్లనుండి నిరీక్షణ చేస్తున్న జిపిఎఫ్ ఉద్యోగులు దాచుకున్న డబ్బులేదు, లోన్లులేవు, ఏమవుతుందో తెలియదని, ఉద్యోగుల ఎపిజిల్ఐ ఏమౌతుందో తెలియదని, ఎక్కడఉందో తెలియని పరిస్థితి ఉందన్నారు. ప్రతినెలా ఉద్యోగులు, ఉపాధ్యాయులు చందా కడుతున్నప్పటికీ డిఎలు పెండింగ్ అని, అసలు డిఎ అంటే మర్చిపోయే పరిస్థితికి ఈప్రభుత్వం తెచ్చిందని వాపోయారు. రివర్స్ పిఆర్సీ, లోన్లురాక పెళ్లిళ్లువాయిదా వేసుకోవడం, సచివాలయ ఉద్యోగులకు పస్తులు, ప్రొహిబిషన్ పీరియడ్ పూర్తయినా సర్వీసు రెగ్యులరైజ్ చేయకపోవడం దురదృష్ట కరమన్నారు.పెన్షనర్లు ఎంతో దీనావస్థలో వున్నారని, కనీసం మందులుకొనడానికి డబ్బులులేక, ఆఖరికి చనిపోయినవారికి దహనఖర్చులు ఇవ్వలేని పరిస్తితిలో ప్రభుత్వముందని విమర్శించారు.ప్రభుత్వం ఉద్యోగుల జీతాలపై స్పష్టమైన నిర్ణయం తీసుకుని సకాలంలో చెల్లింపులు చేయాలని డిమాండ్ చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img