Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

సీతానగరం ఉన్నతపాఠశాలలో విద్యార్థికి గోల్డ్ మెడల్ అందజేత

విశాలాంధ్ర,సీతానగరం: స్థానిక జిల్లా పరిషత్ ఉన్నతపాఠశాలలో ఇటీవల జరిగిన పదోతరగతిలోని అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థిగొరజాన ఆకాశ్ కి గోల్డ్ మెడల్ ను 76వస్వాతంత్ర దినోత్సవ వేడుకలు సందర్బంగా సోమవారంనాడు అందజేసారు. ప్రతీఏటా ఈపాటశాలలో అత్యుత్తమ మార్కులుసాధించిన విద్యార్థికి సీతానగరం గ్రామానికి చెందిన కొమ్మినేని బాబ్జీరావు కుటుంబ సభ్యులు ఈగోల్డ్ మెడల్ ను అందజేయడం ఆనయాయితీగావస్తుంది. సోమవారం నాడు హెచ్ఎం ఇల్లా ప్రసన్నలక్ష్మి అధ్వర్యంలో జరిగినకార్యక్రమంలో పదో తరగతిలో పాఠశాలలోప్రధమస్థానం సాధించిన గొరజాన ఆకాశ్ కు గోల్డ్ మెడల్ ను పెదబోగిలి గ్రామపెద్దలు చేతుల మీదుగా అందజేసారు.ద్వితీయ, తరువాత స్తానాలు పొందిన విద్యార్థులు బి యశ్వంత్ ,టి.శాంతికుమారి,ధనలక్ష్మి, గౌతమ్ ,హరితలకు కూడా దాతలు అందజేసిన క్యాష్ ప్రైజ్ లు అందించారు. పాఠశాల విద్యా కమిటీ అధ్యక్షుడు కొల్లా.శ్రీనువాసరావు ఐదువేలు, గూడూరు జగదీశ్వరరావు నాలుగు వేలు, ఆర్వీ పార్థసారధి మూడువేలు, హెచ్ ఎం ఇల్లా ప్రసన్నలక్ష్మి వేయిరూపాయలు, ఉప సర్పంచ్ అరవింద్ 15వందలరూపాయలు, బత్తుల.శంకరరావు మూడువేలు, జే.నానమ్మ వేయి,జి.సుభద్రమ్మ వెయ్యి రూపాయలు,జి.జగన్మోహనరావు వెయ్యి రూపాయలు,పాఠశాలసైన్స్ఉ పాధ్యాయులుగోపాల్నాయుడు,సోమశేఖర్, తిరుపతి,రాంబాబులు రెండువేలు, జే.సత్యనారాయణ వెయ్యిరూపాయలు, సూర్యనారాయణ రెండువేలు, ఎం.శ్రీనివాసరావులు వెయ్యిరూపాయలను విరాళాలుగా అందజేసారు. పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో  జిల్లా పిఆర్టీయు అద్యక్షులు వోలేటి తవిటినాయుడు తదితరులు పాల్గొన్నారు. ఇదిలాఉండగా పార్వతీపురం మన్యంజిల్లాలో సోమవారం జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో మండలములోని జోగమ్మపేట కెజిబివివిద్యార్థినులు, కోటసీతారాంపురం ప్రాధమిక పాఠశాల విద్యార్థినులు పాల్గొని సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొని చక్కని ప్రతిభను కనపరిచారు. ఈకార్యక్రమంకు కోటసీతారాంపురం హెచ్ ఎం, ఏపిటిఎఫ్ రాష్ట్రనాయకులు చుక్క శ్రీదేవి సమన్వయకర్తగా వ్యవహరించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img