Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

వెన్నెలబుచ్చెమ్మపేటలో గడప గడపకు ప్రభుత్వ కార్యక్రమం

50వ సచివాలయానికి చేరిన కార్యక్రమం
విశాలాంధ్ర, సీతానగరం:మండలంలోని అంటిపేట సచివాలయంపరిధిలోని వెన్నెల బుచ్చెమ్మపేట గ్రామంలో సోమవారం గడప-గడపకు మనప్రభుత్వ కార్యక్రమం ఎమ్మెల్యే జోగారావు ఆద్వర్యంలో జరిగింది . నియోజక వర్గంలోని 142రోజులపాటునిర్వహించినట్లు ఎమ్మెల్యే చెప్పారు. నియోజకవర్గంలోని మూడుమండలాలలో 61గ్రామ సచివాలయాలు, పార్వతీపురం పురపాలక సంఘంలోని 15వార్డుసచివాలయాలకుగాను ఇంతవరకు49గ్రామ, వార్డు సచివాలయాల్లో కార్యక్రమాన్ని పూర్తిచేసి నట్లు చెప్పారు. నేడు 50వ సచివాలయంలో సోమవారం కార్యక్రమం నిర్వహించిన సందర్భంగా మండల, గ్రామ పెద్దలు సమక్షంలో కేకునుకోసి అందరికీ ఎమ్మెల్యే జోగారావు పంచిపెట్టారు.ఎమ్మెల్యేకు స్థానిక సర్పంచ్ సిరికి మహేష్, ఎంపిటిసి శనపతి తిరుపతిరావు, ఉపసర్పంచ్ వాకాడ తిరుపతిరావు, మాజీ జెడ్పీటీసీ అంబటి కృష్ణంనాయుడు, దానబాబుల ఆధ్వర్యంలో ప్రజాప్రతినిధులు, నాయకులు,సచివాలయంఉద్యోగులు, వాలంటీర్లు ఘనస్వాగతం పలికారు.అనంతరం ఎమ్మెల్యే జోగారావు గ్రామంలోని పాఠశాల ప్రహరీని ప్రారంభం చేశారు. అందరితో కలిసి గ్రామంలో ప్రతీగడపకు వెళ్లి ప్రజలను కలుసుకుని యోగ క్షేమాలు తెలుసుకొని ప్రభుత్వం వారికి అందచేసిన సహాయాన్ని వివరిస్తూ ప్రతీఒక్కరూ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిని మళ్లీ సీఎం గా గెలిపించాలని, ఆయనతోపాటు తనకు ఆశీర్వాదంలు అందజేయాలని విజ్ఞప్తి చేశారు.ఈకార్యక్రమంలో ఆయనతోపాటు ఎంపిపి బలగ రవణమ్మ, జడ్పీటీసీ మామిడి బాబ్జీ, మండల పార్టీఅధ్యక్షులు బొంగు చిట్టిరాజు, ఎంపిడిఓ కృష్ణ మహేష్ రెడ్డి, ఈఓపిఆర్డీ వర్మ, ఎంఈఓ సూరి దేముడు,వెలుగు ఏపిఎం శ్రీరాములు, ఉపాధి హామీ పథకం ఏపిఓ నాగలక్ష్మి, హౌసింగ్ ఏఈ జానకీరామ్, వైఎస్సార్సీపీ నాయకులు శ్రీరాములునాయుడు, నాయకులు పోల ఈశ్వరనారాయణ, అంబటి కృష్ణంనాయుడు, రత్నాకర్, ఎన్ రామకృష్ణ, వివిధ గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు, మండల అధికారులు, సచివాలయం సిబ్బంది,వాలంటీర్లు, గ్రామస్తులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img