Wednesday, December 7, 2022
Wednesday, December 7, 2022

నిడగల్లులో డ్రోన్లుతో భూసర్వే

విశాలాంధ్ర, సీతానగరం:మండలంలోని  నిడగల్లు గ్రామంలో శనివారం జగనన్న శాశ్వత భూహక్కు పథకంలో భాగంగా డ్రోన్లుతో భూసర్వేను ప్రారంభం చేశామని తహశీల్దార్ ఎన్వీ రమణ చెప్పారు. డ్రోన్లు ఎగురవేసి భూమిని, హద్దులను పరిశీలించారు. గ్రామాల్లో భూసమస్యల పరిష్కారం కోసం ఈసర్వే ఎంతగానో ఉపయోగపడుతుందని ఆయన అన్నారు.రెవెన్యూ, సర్వే అధికారులు దగ్గరుండి సర్వే నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈకార్యక్రమంలో గ్రామప్రజాప్రతినిదులు, గ్రామపెద్దలు, సచివాలయం సిబ్బంది, సర్వే అధికారులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img