Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

పార్వతీపురం తాలూకా ఏపిఎన్జీవో యూనిట్ ప్రెసిడెంటుగా జివిఆర్ఎస్ కిషోర్

వరుసుగా ఏడోసారి కిషోర్ ఎన్నిక పట్ల ఉద్యోగసంఘాలు, రాజకీయనేతల హర్షం

విశాలాంధ్ర,పార్వతీపురం:పార్వతీపురం తాలూకా యూనిట్ ఏపిఎన్జీఓ ప్రెసిడెంటుగా జివిఆర్ఎస్ కిషోర్ (ల్యాబ్ టెక్నీషియన్, పిపియూనిట్, జిల్లా ఆసుపత్రి,పార్వతీపురం) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.బుదవారం స్థానిక ఎన్జీవో హోంలో జిల్లాఎన్నికలఅధికారి కె.ఆదిలక్ష్మి ఆద్వర్యంలో సహాయఎన్నికలఅధికారి రామారావు,పరిశీలకులు కెబిశ్రీను, శ్రీధర్ బాబుల సమక్షంలో తాలూకా యూనిట్ కార్యవర్గం ఎన్నిక జరిగింది. రాష్ట్ర ఏపిఎన్జీఓ వైస్ ప్రెసిడెంట్ డివిరమణ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. అసోసియేట్ ప్రెసిడెంటుగా వైవి సత్యారావు( డివైఎస్ఓ,పార్వతీపురం) కార్యదర్శిగా పి. పద్మ (సీనియర్ అకౌంటెంట్, పార్వతీపురం) కోశాధికారిగా జి. సత్యనారాయణ (ఎంపిహెచ్ఎస్, కొమరాడ)లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వారితోపాటు ఉపాధ్యక్షులుగా వల్లూరి శ్రీనివాసరావు (టైపిస్ట్,పార్వతీపురం), ఎస్ దుర్గాప్రసాద్ (ఎంపిహెచ్ఎస్, గరుగుబిల్లి), యు. గౌరీశంకరరావు (సెక్రెటరీ, కొమరాడ), పి తిరుపతిరావు (సెక్రెటరీ,ములగ)లు ఎన్నికయ్యారు. ఆర్గనైజింగుకార్యదర్శిగా కె. విజయ్ కుమార్ ఏఈఓ, సహాయ కార్యదర్శులుగా కె రత్నకుమార్ జూనియర్ అసిస్టెంట్, జి వినయ్ కుమార్ జూనియర్ అసిస్టెంట్, చిట్టి.శంకరరావు వార్డుసెక్రటరీ, కె. మధుకర్ జూనియర్ అసిస్టెంట్, మహిళాసహాయకార్యదర్శిగా బి.పుష్ప (ఎంపిహెచ్ఎస్-ఎఫ్, కొమరాడ)లను ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కిషోర్ కుమార్ వరుసుగా ఏడోసారి ఎన్జీఓ అసోసియేషన్ అధ్యక్షుడుగా ఎన్నికపట్ల పార్వతీపురం ఎమ్మెల్యే అలజింగి జోగారావు, మాజీ ఎమ్మెల్యే బొబ్బిలి చిరంజీవులు,జిల్లాలోని వివిధ ఉద్యోగసంఘాలనేతలు, ప్రజా ప్రతినిధులు,నేతలు తదితరులు అభినందించారు. ఏడోసారి ఎన్నికైన కిషోర్ విలేకరులతోమాట్లాడుతూ ఉద్యోగుల సమస్యల పరిష్కారంకోసం నిరంతరం పనిచేస్తానని తెలిపారు. ఉద్యోగుల సంక్షేమమే తనప్రధానలక్ష్యమని చెప్పారు. అందరిసహకారంతో తనకు అప్పజెప్పిన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తానని చెప్పారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img