Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

ప్రకృతి వ్యవసాయంలో తక్కువఖర్చుతో అధిక దిగుబడి సాద్యం

*ఎన్నికల కోడ్ పూర్తయ్యాక పార్వతీపురం,కురుపాం, సాలూరు
రైతుబజారులో ప్రకృతివ్యవసాయ కూరగాయల అమ్మకాలకు ఏర్పాట్లు చేయండి
*పిఎండిఎస్ పై రైతుల్లో అవగాహన పెంచండి

  • జిల్లాలో ప్రకృతి వ్యవసాయ విస్తీర్ణం పెంచేందుకు కృషి చేయాలి:
    జాయింట్ కలెక్టర్ ఓ ఆనంద్

విశాలాంధ్ర – పార్వతీపురం:ప్రకృతి వ్యవసాయం ద్వారా సాగుచేయడంద్వారా తక్కువఖర్చుతో అధికదిగుబడి సాధ్యమని,రైతులు ప్రకృతి సాగువిస్తీర్ణంపై దృష్టి సారించాలని జాయింట్ కలెక్టర్ ఓ. ఆనంద్ తెలిపారు.గురువారం ఉదయం పార్వతీపురం మండలంలోని పెదబొండపల్లి గ్రామంలో ఏపీ సిఎన్ఎఫ్ ద్వారా రైతులు సాగుచేస్తున్న పంటలను ఆయన ఆకస్మికంగా సందర్శించారు. జిల్లాలో ప్రకృతి వ్యవసాయ సాగువిస్తీర్ణం పెంపు, ఉత్పత్తులకు తగ్గమార్కెటింగ్, రబీలో పంటలసాగు తదితర అంశాలను తెలుసుకొని ఆయన పలుసూచనలు చేశారు. రైతులతో ప్రకృతి వ్యవసాయ సాగును, కలిగేలాభాలను అడిగి తెలుసుకున్నారు. రైతులు ప్రకృతి వ్యవసాయసాగులోవాడే
ద్రవజీవామృతం,బీజామృతం, విత్తన గుళికలు తయారీని ఆయనకు చేసి చూపించారు. తక్కువఖర్చుతో మంచి దిగుబడి వస్తుందని వివరించారు.ప్రకృతి వ్యవసాయం ద్వారా కూరగాయల పంటలను ఆయన పరిశీలించారు. రైతులు ఖరీఫ్ సీజనుకు ముందు ఖాలీపొలాల్లో పిఎండిఎస్ విత్తనాలు జల్లడం వల్ల పెరిగే భూసారం గూర్చి అవగాహణ పెంచాలని కోరారు. జిల్లాలో ప్రకృతి వ్యవసాయసాగును గణనీయంగా పెంచాలన్నారు. రైతులు ప్రకృతి వ్యవసాయసాగుపట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికలు కోడ్ పూర్తయ్యాక పార్వతీపురం,కురుపాం, సాలూరు రైతుబజారులలో ప్రకృతి వ్యవసాయం ద్వారా పండిస్తున్న కూరగాయలు విక్రయించే ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఆయనతో పాటు అదనపు డిపిఎం ధనంజయరావు, జిల్లా మార్కెటింగ్ అసోసియేట్ మంతిని మానస, జిల్లా కో ఆర్డినేటర్ ప్రసాద్, ఎంటి నరసింహ, డివిజన్ ఇంచార్జి అప్పలనాయుడు, మండల ట్రైనర్ శ్రీరాములు, స్వామినాయుడు, మండల ఇంచార్జి రమణమ్మ, మాజీ ఎంపీటీసీ యాండ్రాపు చినరామినాయుడు, ఎంఏలు
అనురాధ,తవుడు, ఎంసిఆర్పీ కమల రైతులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img