Monday, September 26, 2022
Monday, September 26, 2022

ప్రకృతివ్యవసాయ సాగుతో అధిక లాభాలు: ఆర్ టి ఓ హేమసుందర్

విశాలాంధ్ర, పార్వతీపురం : ప్రకృతి వ్యవసాయం సాగుచేయడంవల్ల అధిక లాభాలతో పాటు అధిక దిగుబడి ఉండి ఖర్చుబాగా తగ్గుతుందని ఏపిసిఎన్ఎఫ్ రీజనల్ టెక్నికల్ అధికారి హేమసుందర్ తెలిపారు. గురువారంనాడు తోటపల్లి క్లస్టర్ లోని జట్టు అధ్వర్యంలో నిర్వహిస్తున్న ఏపిసిఎన్ఎఫ్ ప్రకృతి వ్యవసాయ సాగును సందర్శించారు. ప్రకృతి వ్యవసాయ విధానాలతో రైతులు వరినాట్లు వేసేకార్యక్రమంలో అయన పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ గిరిజన ప్రాంతాల్లో ప్రకృతి వ్యవసాయ సాగును పెంచే చర్యలు తీసుకుంటున్నామన్నారు. మన్యం జిల్లాలోని రైతాంగం ఎరువులద్వారా సాగుచేస్తున్న వ్యవసాయాన్ని విడిచిపెట్టాలని, అందరికీ ఆరోగ్యాన్ని ఇచ్చే ప్రకృతి వ్యవసాయ సాగును చేపట్టాలని కోరారు.దీనిద్వారా రసాయన ఎరువులు వాడకం తగ్గి ఆరోగ్యానికి ఉపయోగపడే పంటలు దిగుబడి వస్తుందన్నారు. ప్రభుత్వ పరంగా దీనికి ఎక్కువ ప్రోత్సహం ఉంటుందని చెప్పారు.అన్ని ప్రాంతాల్లోని రైతులు ప్రకృతి వ్యవసాయ సాగును ఆచరించడానికి ముందుకు వస్తున్నారని చెప్పారు.గ్రామాల్లోని రైతు భరోసా కేంద్రాల ద్వారా కూడా దీనిపై అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు.విజయనగరంజిల్లా ఏపిసిఎన్ఎఫ్ వ్యవసాయఅధికారిగా పనిచేసి అరకుకుబదిలీపైవెళ్లిన హేమ సుందర్ కుఉత్తరాంధ్రలోని ఆరుజిల్లాల ప్రకృతివ్యవసాయం రీజనల్ టెక్నికల్ ఆఫీసర్ గా పదవీ బాధ్యతలు చేపట్టినసందర్భంగా  అయనను జట్టు ట్రస్ట్ ఘనంగా సన్మానించారు. ఈకార్యక్రమంలో జట్టు ట్రస్టుఎక్జిక్యూటివ్ డి.పారినాయుడు, ఎన్ ఎఫ్ ఏ మంతిని మానస, జట్టు బృందం, రైతులు పాల్గొన్నారు. అయనకు పదోన్నతి రావడం పట్ల మన్యం జిల్లాలోని వ్యవసాయ అధికారులు కూడా అభినందించారు. 

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img