Thursday, April 18, 2024
Thursday, April 18, 2024

మానమ్మకం నువ్వే జగన్

బూర్జలో మండలగృహసారదుల శిక్షణ కార్యక్రమం నిర్వహణ

సీతానగరం: మా నమ్మకం నువ్వేజగనన్నఅంటూ,కన్వీనర్లు,వాలంటీర్లు, కొత్తగా నియమించబడిన గృహసారథులు రానున్న ఎన్నికల్లో జగన్ మోహన్ రెడ్డిని రెండోసారి ముఖ్యమంత్రిగా చేసేందుకు కలిసికట్టుగా పనిచేయాలని పార్వతీపురం ఎమ్మెల్యే జోగారావు, పరిశీలకులు శోభా హైమావతిలు పిలుపునిచ్చారు.మంగళవారం బూర్జ గ్రామంలో ముఖ్యమంత్రి  వైయస్ జగన్మోహన్ రెడ్డి
వైయస్ జగన్మోహన్ రెడ్డి  ఆదేశానుసారం నూతనంగా నియమించుకున్న
సచివాలయాలవాలంటీర్లు, గృహసారధులకు  ప్రత్యేకశిక్షణా కార్యక్రమం మండలపార్టీఅధ్యక్షులు బొంగు చిట్టిరాజు అధ్యక్షతనఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే జోగారావు, పరిశీలకులు బూర్జ, నిడగల్లు, వెంకటాపురం, లక్ష్మిపురం, పెదంకలం, గాదెలవలస, దయానిధిపురం, రంగమ్మపేట,సచివాలయాల పరిధిలో వాలంటీర్లు, సచివాలయం కన్వీనర్లు మరియు గృహసారదులకు పలు అంశాలపై అవగాహన కల్పించారు.రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్ళుగా భావించి అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారన్నారు. కుల మతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ఘనత వైఎస్సార్సీపీ ప్రభుత్వానికే దక్కుతుందని తెలిపారు.గృహసారథులుగా మనం సీఎం జగనన్న చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు సవివరంగా వివరించి, గతప్రభుత్వంకు జగన్ ప్రభుత్వంకు  గలవ్యత్యాసాన్ని ప్రజలకు తెలపాలన్నారు.రాబోయే 2024 సాదారణ ఎన్నికల్లో 175 స్థానాలకు 175 స్థానాలను సాధించే క్రమంలో మన పార్వతీపురం నియోజకవర్గం స్థానంను అత్యధిక మెజారిటీతో గెలిపించి వైయస్ జగన్ ను ముఖ్యమంత్రిగా చేయాలన్నారు. ప్రభుత్వ పథకాలు, పార్టీ కార్యక్రమాలను ప్రజలకు తెలియజేస్తూ వారదులుగా ఉండాలన్నారు. పార్టీ పటిష్టత చేయాల్సిన బాధ్యత మీపై ఉందన్నారు ఈకార్యక్రమంలో జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్ వాకాడ నాగేశ్వరరావు, ఎంపీపీ బలగ రమణమ్మ, జడ్పీటీసీ మామిడి బాబ్జీ, మండలపార్టీ అధ్యక్షులు బొంగు చిట్టిరాజు, జెసిఎస్ మండల కన్వీనర్ యు. సురేష్, బూర్జ సర్పంచ్ గుజ్జలదాస్, ఎంపిటిసి చిన్నం నాయుడు,నాయకులు పోల ఈశ్వర నారాయణ,తెంటు వెంకట అప్పలనాయుడు, ఆర్వీ పార్థసారథి, కొత్నాన రత్నాకరరావు, నడిమింటి రామకృష్ణ, దాసరి నాగరత్నం,మండలంలోని ఎంపీటీసీలు,సర్పంచ్లు, సచివాలయ కన్వీనర్లు, వాలంటీర్లు, ప్రజాప్రతినిధులు, నాయకులు, 8సచివాలయాల సిబ్బంది పాల్గొన్నారు. ఇదిలా ఉండగా ఎమ్మెల్యే జోగారావును, పార్టీపరిశీలకులు శోభా హైమావతిని వారంతా ఘనంగా సన్మానించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img