రాష్ట్రానికి కార్యక్రమంనిర్వహణ
విశాలాంధ్ర – పార్వతీపురం : మండలంలోని కృష్ణపల్లిగ్రామపంచాయతీలో శనివారం సాయంత్రం ఇదేంఖర్మ -మన రాష్ట్రానికి కార్యక్రమంను టీడీపి రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్సీ జగదీశ్,టీడీపినియోజక వర్గఇంచార్జి బొబ్బిలి చిరంజీవులు ఆద్వర్యంలో నిర్వహించారు. గ్రామంలోని ఇంటింటికి వెళ్లి గతమూడున్నర ఏళ్లలో వైఎస్సార్సీపీ ఆన్నివిధాలుగా వైపల్యం చెందిందని తెలిపారు.నిరుద్యోగం, ఆడబిడ్డలకు భద్రత ఏది, బాదుడే బాదుడు, మద్యాంద్ర ప్రదేశ్, ఊసేలేని అభివృధ్ధి, కానరానిరోడ్లు, ఇసుక ఇక్కట్లు, ఏపీరాజదాని ఏది?, అనకొండలా అవినీతి, షాక్ కొట్టించే కరెంటుధరలు, గిట్టనిగిట్టుబాటుధరలు తదితర అంశాలపై ప్రభుత్వ వైపల్యాలను వివరించారు. వైఎస్సారసీపీ దుర్మార్గ పాలనలో మహిళలకూ భద్రత లేదని, యువతకు ఉపాధి లేదని, రైతులకు భరోసా లేదని, రాష్ట్రానికి రాజదాని లేదని నినాదాలు చేశారు. ఈకార్యక్రమంలో పార్వతీపురం పట్టణ, మండలఅధ్యక్షులు గుంట్రెడ్డి రవికుమార్, దొగ్గ మోహనరావు,పార్టీ నాయకులు గొట్టాపు వెంకటనాయుడు, రెడ్డిశ్రీనివాసరావు, గర్భాపు ఉదయభాను కోలాబాబు,బోను దేవీచంద్ర మౌళి, నారాయణరావు, కెంగువ సుధీర్, బంకపల్లి రవికుమార్, కోలా వెంకటరావు, సిరిపురపు భాస్కరరావు, బుడితిశ్రీరాములు, తాన్న ప్రసాద్, గొంగాడ రామమూర్తి, మరిశర్ల కార్తీక్ నాయుడు, శంబంగి తిరుపతిరావు, బేత లక్ష్మణరావు, మరియదాస్, జాగాన రవిశంకర్,సీతానగరం మండల పార్టీ అధ్యక్షుడు కొల్లి తిరుపతిరావు తదితరులు పాల్గొన్నారు.