Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

కేసుల దర్యాప్తును వేగవంతంగా చేయాలి

పార్వతీపురం మన్యంజిల్లా ఎస్పీ

విశాలాంధ్ర, పార్వతీపురం : మన్యం జిల్లాలో కేసుల దర్యాప్తులను వేగవంతంగా చేయాలని పార్వతీపురం మన్యంజిల్లా ఎస్పీ వి.విద్యాసాగర్ నాయుడు అన్నారు.గురువారం సాయంత్రం జిల్లా స్థాయి నేరసమీక్షా సమావేశంను జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించారు. ఈసందర్భంగా  ఎస్పీ వి.విద్యాసాగర్ నాయుడు మాట్లాడుతూ దర్యాప్తు పెండింగులో ఉన్నకేసుల్లో దర్యాప్తును వేగవంతం చేయాలన్నారు. తీవ్రనేరాలు, ఎస్సీ మరియు ఎస్టీ అట్రాసిటీ కేసులను సమీక్షించి, దర్యాప్తు పూర్తి చేసేందుకు అధికారులకు పలుసూచనలుచేశారు. దీనికి సంబంధించి దిశానిర్దేశం చేశారు. కేసుల వివరాలను ఎప్పటికప్పుడు సి సి టి ఎన్ ఎస్ లో నమోదు చేయాలని ఆయన ఆదేశించారు. పట్టణాల్లో వాహనాల ట్రాఫిక్ కు ఎటువంటి ఇబ్బందులులేకుండా చర్యలు చేపట్టాలన్నారు. పెండింగులో ఉన్న నాన్ బెయిలబుల్ వారెంట్లను ఎగ్జిక్యూట్ చేయాలని, అందుకు ప్రత్యేకంగా సిబ్బందిని కేటాయించాలన్నారు. మహిళాపోలీసు సిబ్బంది సేవలను పూర్తి స్తాయిలో వినియోగించు కోవాలన్నారు.ప్రజలకు సైబరు నేరాలు, నకిలీ రుణయాప్ లు, దిశా యాప్, మహిళల భద్రత, రహదారి భద్రతపట్ల అవగాహన కల్పించాలన్నారు. నాటుసారా నియంత్రణకు దాడులను విస్తృతం చేయాలని అధికారులను  ఆదేశించారు. దర్యాప్తు పెండింగులో ఉన్న పలుకేసులను పూర్తి స్తాయిలో సమీక్షించారు.ఈనేరసమీక్షా సమావేశంలో అదనపు ఎస్పీ ఓ.దిలీప్ కిరణ్, పార్వతీపురం డిఎస్పీ ఎ.సుభాష్, పాలకొండ డిఎస్పీ శ్రావణి, సిఐలు ఎన్.శ్రీనివాసరావు, విజయానాంద్, సత్యనారాయణ, మురళీధర్, సిహెచ్ శ్రీనివాసరావు, శ్రీధర్, ఇతరఅధికారులు ఎస్ఐలు, సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img