Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

ఎనిమిదోరోజూ కొనసాగిన జగనన్నే మా భవిషత్ కార్యక్రమం 


విశాలాంధ్ర – సీతానగరం : మండలంలోని దాదాపు అన్ని గ్రామపంచాయతీలో జగనన్నే మాభవిష్యత్ కార్యక్రమం ఎనిమిదోరోజున శుక్రవారంనాడు నిర్వహించామని మండల వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు బొంగుచిట్టిరాజు, జిల్లా వ్యవసాయసలహామండలి ఛైర్మన్ వాకాడ నాగేశ్వరరావు, ఎంపిపి బలగ శ్రీరాములునాయుడు, జెడ్పీటీసీ బాబ్జి, మండల వ్యవసాయ సలహా మండలి ఛైర్మన్ పోల ఈశ్వరనారాయణ, మాజీ సిడిసి ఛైర్మన్ నడిమింటి రామకృష్ణ, మాజీ జెడ్పీటీసీలు అంబటి కృష్ణంనాయుడు, తెంటు వెంకట అప్పలనాయుడు, మాజీ ఎంపీపీ కొట్నానరత్నాకర్, మండల వైఎస్ఆర్సీపీ నేతలు ఆర్వీ పార్థసారథి, గాజాపు శ్రీనివాసరావు, వైస్ ఎంపిపి సూర్యనారాయణ, బొన్నాడ శివ తదితర మండల నాయకులు తెలిపారు. ప్రతీ రోజూ సాయంత్రం పూట నిర్దేశించిన లక్ష్యాలను సాధించడానికి వైఎస్సార్సీపీ నాయకులు కలసికట్టుగా ఉండి కార్యక్రమాన్ని గ్రామాలలో నిర్వహిస్తున్నారు. పెదఅంకలం గ్రామంలో ఎంపిపి బలగ రవనమ్మ, లచ్చయ్యపేటలో జెడ్పీటీసీ బాబ్జి, కాసాపేటలో తెంటు వెంకట అప్పలనాయుడు,చినభోగిలి, బక్కుపేట, తామరకండి, గెడ్డలుప్పి, కోట సీతారాంపురం, గాదెలవలస, జానుమల్లు వలస, సుభద్ర సీతారాంపురం, పెదబోగిలి, అప్పయ్యపేట, బుడ్డిపేట, నిడగల్లు, ఇప్పలవలస, పాపమ్మవలస, కొత్తవలస, అంటిపేట, బూర్జ, కృష్ణరాయపురం,
పనుకుపేట, దయానిధిపురం, లక్ష్మిపురం , బల్ల కృష్ణాపురం, బగ్గందొరవలస, మరిపి వలస, సూరమ్మపేట గుచ్చిమి, జోగమ్మపేట తదితర గ్రామాల్లో గురు వారంనాడు  జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమంను నిర్వహించారు.అయా గ్రామంలోని ప్రజల ఇళ్లకు వెళ్లి వారిని నేరుగా కలుసుకొని వారికి వైసీపీ ప్రభుత్వం వచ్చాక చేకూరిన లబ్ధి, పొందిన ప్రయోజనాలను  వివరించారు.  ప్రతీఇంటి వద్ద ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని , సంక్షేమ పథకాలను వివరించారు. వారి ఆమోదం మేరకు డోరుపై జగనన్నే మా భవిష్యత్తు, మా నమ్మకం నువ్వే జగన్ అనే స్టికర్ ను అంటించారు.ఫోన్ పై స్టిక్కర్ను అతికించి వారితో కలిసి ఫోటో దిగారు. రానున్న సాధారణ ఎన్నికలలో ముఖ్య మంత్రి వైఎస్ జగ్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసేందుకు అంతా కలిసికట్టుగా పనిచేద్దామని తెలిపారు. వైఎస్ జగ్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాల ద్వారా అన్ని వర్గాల ప్రజలు లబ్ది పొందారని తెలిపారు. ఈకార్యక్రమంలో ఆయా గ్రామాలకు చెందినసర్పంచులు,ఎంపీటీసీలు,కన్వీనర్లునాయకులు, గృహ సారథులు,వాలంటీర్లు పాల్గొన్నారు. ఎమ్మెల్యే జోగారావు అదేశాలు, సూచనలు, సలహాలు మేరకు కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img