Wednesday, June 7, 2023
Wednesday, June 7, 2023

సర్పంచ్‌గా మహేష్ సేవలు అభినందనీయం


విశాలాంధ్ర – సీతానగరం : అంటిపేట గ్రామ సర్పంచ్‌గా సిరికి మహేష్ చేసిన సేవలు ఎంతో అభినందనీయమని సచివాలయం ఉద్యోగులు, గ్రామపెద్దలు, వార్డుసభ్యులు తెలిపారు.శుక్రవారంనాడు సర్పంచ్ మహేశ్ దంపతులను సచివాలయంలో ఘనంగా సత్కరించారు. మహేష్ గురువారం ఉపాధ్యాయునిగా చేరడంతో ఆయనకు ఘనంగా వీడ్కోలు పలికారు. అంటిపేట పంచాయతీ అభివృద్ధిలో, అందరికీ అందుబాటులో ఉండి సేవలు అందించేందుకు మహేష్ చేసిన కృషి ఎంతో గొప్పదని కొనియాడారు. గతంలో మహేష్ తల్లి సర్పంచుగా పనిచేసిన సమయంలోనూ, ప్రస్తుతం ఆయన పదవీ కాలంలోను అంటిపేట అన్నింటిలో ముందంజలో ఉండేదని కొనియాడారు. సన్మానగ్రహీత మహేష్ మాట్లడుతూ తనకు విధ్యార్థులకు బోధించే అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి వైఎస్ జగ్మోహన్రెడ్డి ప్రభుత్వానికీ రుణపడి ఉంటానని తెలిపారు.25ఏళ్ల తరువాత తనకు ఉపాధ్యాయ పోస్టు రావడం అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు. రాజకీయాలలోను,సర్పంచ్ పదివిలో తనకు అన్నివేళలా అండదండలు ఇచ్చిన అంటిపేటప్రజలకు,సీతానగరం మండలంలోని నాయకులకు ఎల్లపుడూ రుణపడి ఉంటానని చెప్పారు. ఈకార్యక్రమంలో సెక్రటరీ శశిభూషణరావు, ఉప సర్పంచ్ బొంగు తిరుపతిరావు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img