Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

పలు గ్రామాల్లో స్వచ్చతే సేవా కార్యక్రమాలు నిర్వహణ

విశాలాంధ్ర,సీతానగరం: మండలములోని పలు గ్రామ పంచాయతీల్లో శుక్రవారం స్వచ్చతే సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని మండల పంచాయతీ విస్తరణ అధికారి వర్మ చెప్పారు. బక్కుపేటలో జరిగిన కార్యక్రమంలో ఆయనపాల్గొన్నారు.

అంటిపేట పంచాయతీ పరిధిలో సర్పంచ్ 

ఎస్ మహేశ్వర రావు  ఆధ్వర్యంలో   ‘స్వచ్ఛతే- సేవ’ కార్యక్రమ ర్యాలీ నిర్వహించారు. గ్రామ సర్పంచ్ మాట్లాడుతూ గ్రామం పరిశుభ్రంగా ఉంచుకొనుట కోసం తడి, పొడి చెత్తను వేరు చేసి క్లాప్ మిత్రాలకు ఇవ్వాలన్నారు. గ్రామ పంచాయతీకి ఇచ్చిన తడి చెత్త ద్వారా వర్మీ కంపోస్టును తయారు చేసి రైతులకు అందచేసే విధంగా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. తడి చెత్త నుంచి వచ్చిన వర్మీ కంపోస్టు ద్వారా భూసారం పెరిగి మంచి పంటలు పండుతాయన్నారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ సంచులను వాడకూడదన్నారు. అక్టోబర్ 2 వరకూ జరిగే స్వచ్చతే సేవ కార్యక్రమంలో  ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం వహించి ముందుండి నడిపించాలని గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలని అందరితో ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ సభ్యులు అంబటి కృష్ణం నాయుడు , ఎంపీటీసీ శనపతి నిర్మల గారు, బీసీ కార్పొరేషన్  డైరెక్టర్  శనపతి తిరుపతిరావు ఉపసర్పంచ్  తిరుపతిరావు  హెడ్ మాస్టర్  చిన్నంనాయుడు  విద్యార్థులు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్స్ మరియు ప్రజలు పాల్గొన్నారు.  పెదభోగిలి గ్రామ పంచాయతీలో జరిగిన కార్యక్రమంలో సర్పంచ్ తేరేజమ్మ, ఉప సర్పంచ్ అరవింద్, ఈఓ వెంకటరావు సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు 

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img