Friday, April 19, 2024
Friday, April 19, 2024

నేడు మెగా రక్తదాన కార్యక్రమం నిర్వహణ

విశాలాంధ్ర,పార్వతీపురం : మెగారక్తదాన శిబిరాలను శనివారం నిర్వహిస్తున్నట్లు జిల్లా టిబి, లెప్రసీ, ఎయిడ్స్ అధికారి మరియు జిల్లా బ్లడ్ బ్యాంక్  నియంత్రణ అధికారి డా.సిహెచ్.విజయ్ కుమార్ తెలిపారు. పార్వతీపురంలోని ఎల్.ఐ.సి కళ్యాణమండపంలోను, గుమ్మలక్ష్మీపురం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో  ఈమెగారక్తదాన శిబిరాలు జరుగుతాయని ఆయన తెలిపారు.భారతదేశ మంతట మెగా రక్తదాన కార్యక్రమం ఏర్పాటుచేసి ఒక్క రోజులో లక్ష రక్త యూనిట్లుసేకరించుట లక్ష్యంగా భారత ప్రభుత్వం సెప్టెంబరు 17వ తేదిన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిందని తెలిపారు. “రక్తదానం చేయడం – సంఘీభావము చాటడం. చేయి,చేయి కలుపుదాం – ప్రాణాలను కాపాడుదాం” నినాదంతో కార్యక్రమం నిర్వహించడం జరుగుతోందని ఆయన వివరించారు.
జాతీయ రక్త దాన పక్షోత్సవాలుగా సెప్టెంబరు 17నుండి అక్టోబరు1వరకు నిర్వహించడం జరుగుతోందని ఆయన చెప్పారు. పక్షోత్సవాలలో సుమారు 20 స్వచ్చంద రక్తదానశిబిరాలు ఏర్పాటు చేయుటకు ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు.మెగారక్త దాన కార్యక్రమంలో భాగంగా స్వచ్చంద రక్త దాతలు తమ పేర్లను ఇ-రక్త కోష్ యాప్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని విజయ కుమార్ తెలిపారు. స్వచ్చంద రక్త దాన శిబిరాల ఏర్పాటుకు జిల్లాలో గుర్తింపు పొందిన రక్త నిధి కేంద్రం లేదా జిల్లా టిబి, లెప్రసి, ఎయిడ్స్ అధికారిని సంప్రదించి కార్యక్రమాలు నిర్వహించాలని ఆయన కోరారు. జిల్లాలో యువత, స్వచ్చంధ సంస్థలు, ప్రభుత్వ సిబ్బంది, సచివాలయాల సిబ్బంది, ఇతర సామాజిక సంస్థలు అందరూ ముందుకు వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. మరిన్ని వివరాలకు డా. వినోద్ కుమార్, బ్లడ్ బ్యాంక్ మెడికల్ ఆఫీసర్, పార్వతీపురం – 80083 11511‬, డా. విజయ్ కుమార్, జిల్లా టిబి, లెప్రసి, ఏయిడ్స్ అధికారి – 8686717121ని సంప్రదించవచ్చునని తెలిపారు. 

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img