Friday, April 19, 2024
Friday, April 19, 2024

పనుకుపేటలో ఇదేంఖర్మ-మనరాష్ట్రానికి కార్యక్రమం నిర్వహణ

విశాలాంధ్ర, సీతానగరం:మండలంలోని పనుకుపేట గ్రామంలో ఇదేంఖర్మ -మన రాష్ట్రానికి కార్యక్రమంను టీడీపినియోజక వర్గఇంచార్జి బొబ్బిలి చిరంజీవులు ఆద్వర్యంలోశుక్రవారం సాయంత్రం నిర్వహించారు. గ్రామంలోని ఆన్ని వీదుల్లో,ఇంటింటికి వెళ్లి గతమూడున్నర ఏళ్లలో వైఎస్సార్సీపీ ఆన్నివిధాలుగా వైపల్యం చెందిందని తెలిపారు.నిరుద్యోగం, ఆడబిడ్డలకు భద్రత ఏది, బాదుడే బాదుడు, మద్యాంద్ర ప్రదేశ్, ఊసేలేని అభివృధ్ధి, కానరానిరోడ్లు, ఇసుక ఇక్కట్లు, ఏపీరాజదాని ఏది?, అనకొండలా అవినీతి, షాక్ కొట్టించే కరెంటుధరలు, గిట్టనిగిట్టుబాటుధరలు తదితర అంశాలపై ప్రభుత్వ వైపల్యాలను వివరించారు. బిసి లకు అన్నివిధాలుగా అన్యాయం చేసినట్లు చెప్పారు. టిడిపినాయకులు ఇదేంఖర్మ గోడపత్రికలు ప్రతీ ఇంటివద్ద అందజేసి,అంటించి ప్రభుత్వ వైపల్యాలను వివరించారు. 9261292612 నెంబరుకు వారంతా మెసేజ్ పెట్టడంతో గ్రామంలో కార్యకర్తలతో పెట్టించారు.ఈకార్యక్రమంలో టీడీపీ నేతలు గర్భాపు ఉదయభాను, వాడాడ రాము,మండల టిడిపి అధ్యక్షుడు కొల్లితిరుపతిరావు, ప్రధానకార్యదర్శి రౌతు వేణుగోపాలనాయుడు,హారి, బైరిపూడి స్వామినాయుడు, లక్ష్మణరావు, బుడితి శ్రీను, సబ్బాన శ్రీను, కొట్నాన రామకృష్ణ, పెంట సత్యంనాయుడు, మూడడ్ల వెంకట నాయుడు,సబ్బన జగన్నాధం,మర్రాపు యోగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా నియోజక వర్గంలోని అన్ని గ్రామాల్లో ఇదేం ఖర్మ కార్యక్రమంకు మంచి స్పందన స్తానిక ప్రజల నుండి లభిస్తుందని నియోజక వర్గం ఇంచార్జి బొబ్బిలి చిరంజీవులు చెప్పారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img