Friday, April 19, 2024
Friday, April 19, 2024

ముగ్గురు ఐఏఎస్ ల ఆద్వర్యంలో స్పందన ప్లస్ నిర్వహణ

శాలాంధ్ర,పార్వతీపురం: పార్వతీపురం మన్యం జిల్లాలో ముగ్గురు ఐఎఎస్ అధికారులు ఆద్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద గ్రీవెన్స్, స్పందన ప్లస్ కార్యక్రమాలను జిల్లాఅధికారులందరి సమక్షంలో ప్రతీసోమవారం గ్రీవెన్స్ నిర్వహిస్తున్నారు. జిల్లా ఆవిర్భావం నుంచి నిరాటంకంగా గ్రీవెన్స్, స్పందన ప్లస్ కార్యక్రమాలకు జిల్లాలోని నాలుగు నియోజక వర్గంలోని పిర్యాదు దారులు విచ్చేసి సమస్యల్ని తెలియ జేస్తున్నారు. వారి పిర్యాదులను ఆన్లైన్ చేస్తూ త్వరితగతిన పరిష్కారం చేయడానికి తగుచర్యలు తీసుకుంటున్నారు. దీంతో పాటు టెలికాన్ఫరెన్స్, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లాలో ప్రగతిని, అభివృధ్ధి కార్యక్రమాలను ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహించి మండల, గ్రామ సచివాలయంలలో మౌళికసదుపాయాలు కల్పన,నిర్మాణాలు వేగవంతం చేయడం,అభివృద్ధి కార్యక్రమాలను పర్యవేక్షణ చేస్తున్నారు. దీంతోపాటు గ్రామ సచివాలయాల సందర్శనకు కూడా ప్రాధాన్యత నిస్తూ ఎప్పటికప్పుడు  పర్యవేక్షణ చేస్తున్నారు. సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్ కార్యక్రమాల్లో జిల్లా కలెక్టర్ నిషాంత్ కుమార్, జాయింట్ కలెక్టర్ ఆనంద్, ఐటీడీఏ పీవో విష్ణు చరణ్ తో పాటు జిల్లా అధికారులు మొత్తం పాల్గొని 90గ్రీవెన్స్ దరఖాస్తులు స్వీకరించారు. ఎక్కువమంది సదరం ధృవీకరణ పత్రాలలో వికలాంగశాతం పెంచాలని, టెంపరరీ సర్టిఫికేట్లు రద్దు చేయాలని, పింఛన్లు మంజూరు చేయాలని, భూమి సమస్యలు పరిష్కారం చేయాలని కోరుతూ వినతులు అందజేస్తున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img