Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

నాలుగో రోజున కొనసాగిన గడపగడపకు మనప్రభుత్వ కార్యక్రమం

విశాలాంధ్ర – సీతానగరం : మండలంలోని  బూర్జ గ్రామసచివాలయంలోని బూర్జ, ఆవాలవలస లలో స్థానిక ఎమ్మెల్యే అలజంగి జోగారావు సారధ్యంలో గురువారం నాడు గడప గడపకు మనప్రభుత్వం కార్యక్రమం నాలుగోరోజు నిర్వహించారు.226వ రోజున 67వ సచివాలయంలో జరిగిన కార్యక్రమానికి గ్రామానికి విచ్చేసిన ఎమ్మెల్యే జోగారావుకు ఆవాలవలసలో ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, ఉద్యోగులు, వైఎస్సార్సీపీ కన్వీనర్లు స్థానిక ప్రజలు ఘనస్వాగతం పలికారు.ఎమ్మెల్యే గడప గడపకు కార్యక్రమం ప్రారంభించి ప్రజలను కలుసుకుని వారి యోగక్షేమాలను తెలుసుకోవడంతోపాటు అభివృద్ధి పనులు, సంక్షేమం చూసి తనను, రాష్ట్ర ముఖ్యమంత్రి  వైయస్ జగన్మోహన్ రెడ్డికి అశీస్సులు అందించాలని విజ్ఞప్తి చేశారు.ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు సవ్యంగా అందుతున్నదీ లేనిదీ తెలుసుకుని మీఅందరికీ మంచి చేయాలన్నదే జగన్ ప్రభుత్వ ధ్యేయమని తెలిపారు.ఎవరికి ఏసమస్య ఉన్నా తక్షణ పరిష్కారంచేసి చూపడం జరుగుతుందన్నారు.  ఎమ్మెల్యే ప్రజలకు హామీఇస్తూ ప్రజా సమస్యలను సహితం వారి ముంగిటనే పరిష్కరించడం జరుగుతుందన్నారు. వారి సమస్యలను క్షుణ్నంగా తెలుసుకొని పరిష్కారం చేసే చర్యలు తీసుకుంటున్నారు. ప్రతీ గడపలో వారితో మమేకమై కుశల ప్రశ్నలు అడుగుతూ వారి యోగ క్షేమాలు తెలుసుకొని ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరిస్తున్నారు.ఈకార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు సర్పంచ్ గుత్తావిల్లి దాసు, జడ్పీటీసీ మామిడి బాబ్జీ, మండల పార్టీ అధ్యక్షులు బొంగు చిట్టిరాజు, ఎంపీటీసీ చిన్నంనాయుడు సర్పంచ్లు జి.అన్నం నాయుడు, బి.శ్రీనివాసరావు,
కె. శ్రీనివాసరావు, టి.వెంకటరమణ, బొన్నాడ తిరుపతిరావు, శ్రీనివాసరావు, వైకాపా సీనియర్ నాయకులు అర్వీ పార్థసారథి,, పోల ఈశ్వరనారాయణ, బి ముకుంద, గోపాల్,బొన్నాడ సత్యనారాయణ, బి.గౌరునాయుడు, రెడ్డి అప్పలనాయుడు,  సత్యన్నారాయణ, డి నాగరత్నం ఎన్ రామకృష్ణ,, రమేష్, చప్ప సురేష్, తెర్లి సూరపునాయుడు, మూడడ్ల అప్పలనాయుడు, అల్లు శ్రీనివాసరావు, రెడ్డి అచ్యుత, నీరస చంద్ర శేఖర్,గొడబప్రమీల, ఈదుబిల్లి అనిత తదితరలతోపాటు అధికారులు,సచివాలయం సిబ్బంది, వాలంటీర్లు, వైఎస్సార్సీపీ నాయకులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా శుక్రవారం పెదబోగిలి రెండో సచివాలయంలో( 227 రోజున 67వ సచివాలయం)జరుగుతుందని ఎమ్మెల్యే జోగారావు తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img