Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

సూక్ష్మ పరిశీలకులు ఎన్నికల నిబంధనలు సక్రమంగా పాటించాలి

విశాలాంధ్ర,పార్వతీపురం: శాసనమండలి పట్టభద్రుల ఎన్నికలనిర్వహణలో మైక్రో అబ్జర్వర్లు ఎన్నికల నిబంధనలు సక్రమంగా అమలు జరిగేలా చూడాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ తెలిపారు. సోమవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించిన మైక్రో అబ్జర్వర్ శిక్షణా తరగతులను ఆయన ప్రారంబించారు.ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ మైక్రో అబ్జర్వర్ ఎన్నికల ప్రక్రియ సక్రమంగా జరిగేలా పరిశీలించాలని తెలిపారు.
గంటముందుగా పోలింగుకేంద్రానికి చేరుకోవాలని సూచించారు. మహిళలు, విభిన్న ప్రతిభావంతులు, వయోవృద్ధులకు ప్రత్యేక క్యూ లైన్ ఏర్పాటు చేయాలన్నారు. మంచినీరు తదితర మౌలిక సదుపాయాలు ఏర్పాటును పరిశీలించాలన్నారు. రాజకీయ పార్టీల పోలింగ్ ఏజెంట్లు, ఇతర సిబ్బంది హాజరు పరిశీలించాలన్నారు. A అబ్జర్వర్ డైరీ లోని నిబంధనలు పాటించాలని, చెక్ లిస్ట్ ప్రకారం సరిచూసుకోవాలని తెలిపారు.
జిల్లారెవెన్యూ అధికారి వెంకటరావు మాట్లాడుతూ శాసనమండలి ఎన్నికలు సజావుగా, ప్రశాంతంగా జరిగేందుకు మైక్రో అబ్జర్వర్లు కీలకంగా వ్యవహరించాలన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఏమైనా ఇబ్బందులు తలెత్తితే ప్రిసైడింగ్ అధికారి దృష్టికి తీసుకురావాలని సూచించారు. మార్చి 12న ఎన్నికలకు సంబంధించి సామాగ్రిని పంపిణీ చేయడం జరుగుతుందని, పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ కు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. ఎన్నికలకు వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. మార్చి 13న పోలింగు కు ముందు పారదర్శకతకు ఖాళీ బ్యాలెట్ బాక్స్ ను ఏజెంట్ సమక్షంలో చూపించి పోలింగ్ ప్రారంభించాలని అన్నారు. ఓటు హక్కు వినియోగించుకునే పట్టభద్రులకు 12 రకాల గుర్తింపు కార్డులను ఎన్నికల కమిషన్ అనుమతించిందని, గుర్తింపు కార్డు తప్పనిసరి అని స్పష్టం చేశారు. అనంతరం ఎన్నికల ప్రక్రియ ముగిసేవరకు పగడ్బందిగా నిర్వహించేందుకు తీసుకోవలసిన జాగ్రత్తలపై శిక్షణను అందించారు.ఈకార్యక్రమంలో ఎల్ డి ఎం, మైక్రో అబ్జర్వర్లు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img