ఎమ్మెల్యే అశోక్ సతీమణి నీలోత్పల
విశాలాంధ్ర-కవిటి: రానున్న ఎన్నికల్లో ఎమ్మెల్యే అశోక్ ఎంపీ రామ్మోహన్ నాయుడు అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఎమ్మెల్యే బెందాళం అశోక్ సతీమణి నీలోత్పల అన్నారు.ఈ మేరకు శుక్రవారం మండలంలోని బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమంలో భాగంగా ఆమె తేదేపా నాయకులతో కలసి డిజి పుట్టుగ పంచాయతీ పరిధిలో జల్లుపుట్టుగ,డీజీ పుట్టుగ గ్రామాలలో పర్యటించారు.ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి అధికార వైసిపి వైఫల్యాలను వివరించారు.రానున్న ఎన్నికల్లో మరో మారు ఎమ్మెల్యేగా అశోక్ బాబు, ఎంపీగా కింజరపు రామ్మోహన్ నాయుడుని రెండు ఓట్లు సైకిల్ గుర్తుపై వేసి గెలిపించాలని కోరారు.ఈ కార్యక్రమం లో ఎస్ వి రమణ,మణి చంద్ర ప్రకాష్,బెందాళo తిరుమల రావు, బార్ల చినబాబు,జల్లు సుబ్బా రావు, కే లక్ష్మి,రోయ్యి భాగ్యశ్రీ, భావన రాధిక, మండల తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.