Tuesday, April 16, 2024
Tuesday, April 16, 2024

ఎమ్మెల్సీ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలి

జిల్లా కలెక్టర్

విశాలాంధ్ర,పార్వతీపురం : పట్టభద్రుల ఎన్నికలను సజావుగా, పకడ్బందిగా నిర్వహణకు అన్నిచర్యలు చేపట్టాలని ఉత్తరాంధ్ర జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం ఎన్నికల పరిశీలకులు, రాష్ట్ర సర్వే కమీషనర్ సిద్ధార్థ జైన్ అన్నారు. మంగళవారం విశాఖపట్నం నుంచి సంబంధిత జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈసందర్భంగా ఎన్నికల నిర్వహణప్రణాళిక, ఎన్నికలఅనంతరం బ్యాలెట్ బాక్సులు విశాఖ పట్నంలోని స్ట్రాంగ్ రూంకు తరలించేందుకు చర్యలను అడిగితెలుసుకున్నారు. వెబ్ కాస్టింగ్ లేని పోలింగ్ కేంద్రాలవద్ద వీడియో గ్రాఫర్ ను ఏర్పాటుచేయాలని ఎన్నికల పరిశీలకులు సూచించారు. ఎన్నికల నిర్వహణకు తీసుకున్న చర్యలపై ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు.జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ కుమార్ మాట్లాడుతూ పార్వతీపురంలో తాత్కాలిక స్ట్రాంగ్ రూం ను ఏర్పాటుచేశామని, పోలింగ్ బాక్సులను విశాఖపట్నం తరలించేందుకు అన్ని చర్యలు చేపట్టామని తెలిపారు. పోలింగ్ సజావుగా నిర్వహించేందుకు మండల స్థాయి ఎన్నికల అధికారులు, పోలీస్ అధికారులతో జిల్లా పోలీస్ సూపరిండెంట్ తో సంయుక్తంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సూచనలు చేయడమైనదని తెలిపారు. ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఎన్నికల విధులు నిర్వహించే పట్టభద్రులు పోస్టల్ బ్యాలెట్ లో ఓటు హక్కు వినియోగించుకొనెలా సౌకర్యం కల్పించాలని సూచించారు.
జిల్లాపోలీస్ సూపరిండెంట్ విద్యాసాగర్ నాయుడు మాట్లాడుతూ జిల్లాలో
8సున్నితమైన పోలింగ్ కేంద్రాలుగా గుర్తించడం జరిగిందన్నారు. ఎటువంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు రూట్, మొబైల్స్, స్ట్రైకింగ్ ఫోర్సులను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
ఈకార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి జల్లేపల్లి వెంకటరావు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img