Friday, April 19, 2024
Friday, April 19, 2024

వాహనదారులు రోడ్డు నియమావళిని తప్పనిసరిగా పాటించాలి: డిఎస్పీ సుభాష్

విశాలాంధ్ర,సీతానగరం: వాహనదారులు ప్రతీఒక్కరు రోడ్డునియమావళిని తప్పనిసరిగా పాటించి ప్రమాదాల నివారణకు కృషి చేయాలని పార్వతీపురం డి.ఎస్పీ ఏ.సుభాష్ కోరారు. మంగళవారం సీతానగరం మండలములోని అప్పయ్యపేటవద్ద రాష్ట్రీయరహదారిపై వాహనాలను తనిఖీచేయడంతోపాటు గతంలో విధించిన అపరాధరుసుంలు వసూల్లును తనిఖీచేశారు.
వాహనయజమానులు తప్పనిసరిగా ఆన్ని దృవీకరణ పత్రాలు కలిగిఉండాలని, తప్పనిసరిగా లైసైన్సు కలిగి ఉండాలన్నారు. హెల్మెట్ వేసుకొని వాహనాలు నడపాలన్నారు. మధ్యం సేవించి వాహనాలను నడపవద్దని సూచించారు. మైనర్లుకు వాహనాలను తల్లిదండ్రులు ఇవ్వవద్దని తెలిపారు. అతివేగంగా వాహనాలను నడిపి ప్రమాదాలకు గురికావద్దన్నారు. మండలంలో ఎక్కువ రాష్ట్రరహదారి ఉండటంతో పోలీస్ సిబ్బంది ప్రమాదాలు నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించారు.పలుఅంశాలపై వాహనదారులకు, ప్రయాణికులకు సూచనలు ఇచ్చారు.ఆయనతో పాటు ఎస్ఐ నీలకంఠం, పోలిస్ సిబ్బంది, ఇంటిలిజెన్స్ సిబ్బంది కృష్ణమోహన్ లు ఉన్నారు. 

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img