Tuesday, December 6, 2022
Tuesday, December 6, 2022

పెదబోగిలి చెత్త సంపద కేంద్రాన్ని సందర్శన చేసిన ఎంపిడిఓ, ఈఓపిఆర్దిలు

విశాలాంధ్ర,సీతానగరం: మండల కేంద్రము లోని పెదభోగిలి చెత్త సంపద కేంద్రాన్ని ఎంపిడిఓ కృష్ణ మహేశ్ రెడ్డి, మండల పంచాయతీ విస్తరణ అధికారి వర్మలు సోమవారం పరిశీలింఛారు. ఇక్కడ తయారు చేస్తున్న వర్మీ కంపోస్టును అమ్మకంజరిపి పంచాయతీ ఆదాయానికి తోడ్పడుటకు క్లాప్ మిత్రాలకు జీతభత్యాలు ఇచ్చేందుకు కూడా ఉపయోగపడే విధంగా మార్కెట్ లింకేజీ ఏర్పాటు చేసుకొనుటకు సూచనలు చేసారు.అలాగే షెడ్ లో వున్న సాంకేతిక పరికరాలను పూర్తి స్థాయిలో వినియోగంలోకి తీసుకురావాలని, షెడ్ చుట్టుప్రక్కల వున్న ఖాళీ స్థలంను కూడా వినియోగంలోకి తీసుకుని రావాలని సూచనలు జారీచేశారు. పంచాయతీ ఈవో వెంకట్రావు, క్లాప్ మిత్రలు హాజరయ్యారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img