Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

జాతీయ వృద్ధుల హెల్ప్ లైన్ 14567 సేవలను ఉపయోగించుకోవాలి

జిల్లా కలెక్టర్ నిషాంత్ కుమార్

విశాలాంధ్ర – పార్వతీపురం : పార్వతీపురం టౌన్: వయోవృద్దులు సహాయంకొరకు ఏర్పాటు చేసిన హెల్ప్ లైన్ 14567 సేవలను ఉపయోగించుకోవాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ తెలిపారు.
సోమవారం  కలెక్టరు ఛాంబర్ లో జాతీయ వృద్ధుల హెల్ప్ లైన్ 14567 పోస్టరును జిల్లాకలెక్టర్  నిశాంత్ కమార్ ఆవిష్కరించారు. ఈసందర్బంగా అయన మాట్లాడుతూ సమాచారం, భావొద్వేగ సహాయం,తల్లితండ్రులు-వృద్దుల చట్టాలు, వ్యక్తిగత, కుటుంబ సమస్యలపై న్యాయ సలహాలు, సూచనలు, క్షేత్రస్థాయిలో సహాయం కోసం జాతీయ వృద్దుల హెల్ప్ లైన్ 14567 టోల్ ఫ్రీ నెంబర్ వయో వృద్దులు ఉపయోగించుకోవాలన్నారు.    ఎల్డర్ లైన్ 14567 పై వృద్దులకు మరియు తల్లితండ్రులకు అవగాహనా కలిగేలేలా జిల్లాయంత్రాంగం అవగాహన కల్పించాలని కోరారు. తల్లితండ్రులకు,  వృద్దులకు ఏఅవసరంవచ్చినా 14567కు కాల్ చేసి సహాయం పొందవచ్చని తెలిపారు.ఈకార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఓ. ఆనంద్, సబ్ కలెక్టర్ భావన, జాతీయవృద్దుల దివ్యంగులు-వయోవృద్దుల శాఖ ఏడి ఎం కిరణ్ కుమార్, వృద్ధుల హెల్ప్ లైన్ స్టేట్ మేనేజర్ పి.శంకరనారాయణ, ఎఫ్ఆర్ఓ టి.తిరుపతిరావు, జిల్లాఅధికారులు పాల్గొన్నారు. 

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img