Sunday, April 2, 2023
Sunday, April 2, 2023

జిల్లా జైలు ను సందర్శించిన జిల్లా న్యాయ సేవ అధికారులు

విశాలాంధ్ర – శ్రీకాకుళం రూరల్ : శ్రీకాకుళం జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవ అధికారుల సంస్థ అధ్యక్షులు జునైద్ అహ్మద్ మౌలానా ఆదేశములు మేరకు జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి ఆర్ సన్యాసినాయుడు మంగళవారం స్థానిక అంపోల్లోని జిల్లా జైలును సందర్శించారు.ఈ సందర్భంగా జిల్లా జైల్లోని ముద్దాయిలను కలుసుకోవడానికి వచ్చిన కుటుంబ సభ్యులు స్నేహితులతో మాట్లాడి ఆర్థిక స్తోమత లేని వారికి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఉచితంగా న్యాయవాదిని నియమించి వారి కేసు నడిపిస్తుందని తెలిపారు. జైల్లోని మహిళా ఖైదీలు మరియు ఇతర ఖైదీలతో వ్యక్తిగతంగా మాట్లాడి ఖైదీలకు అందుతున్న భోజన మరియు ఇతర వసతులు సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఎవరికైనా న్యాయ సహాయం కావాలంటే జిల్లా న్యాయసేవాధికార సంస్థకు తెలియజేస్తే వెంటనే ఉచిత న్యాయవాదులు నియమిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో న్యాయవాది గేదలు ఇంద్రప్రసాద్ జైలర్ భాస్కర రావు జైలు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img