Wednesday, March 29, 2023
Wednesday, March 29, 2023

ఘనంగా పొట్టి శ్రీరాముల జయంతి వేడుకలు నిర్వహణ

విశాలాంధ్ర,సీతానగరం : ఆంధ్ర రాష్ట్ర అవతరణకోసం ప్రాణత్యాగం చేసిన మహనీయుడు పొట్టిశ్రీరాములని సీతానగరం మండలంలోని ఆర్యవైశ్య సంఘం, వాసవీ క్లబ్ నాయకులు కొనియాడారు.గురువారం పొట్టి శ్రీరాములు 123జయంతిని పురస్కరించుకొని పెదభోగిలి మేజర్ పంచాయతీ ఆవరణలోని విగ్రహాన్ని ముందుగా శుభ్రంచేసి,పాలాభిషేకం నిర్వహించారు. ఆయన విగ్రహానికి పూలమాలలువేసి నివాళులర్పించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ ఆంధ్రరాష్ట్ర ఆవిర్భానికి శ్రీకారం చుట్టి అమరజీవిగా పొట్టిశ్రీరాములు నిలిచారని  కొనియాడారు. ఆంధ్రుల చిరకాల స్వప్నమైన రాష్ట్ర ఏర్పాటుకోసం ఆమరణ నిరాహారదీక్షచేసి ప్రాణత్యాగం చేసిన మహాపురుషుడు పొట్టి శ్రీరాములని అన్నారు.ఆయన త్యాగం అజరామరం అన్నారు. ఆయన చేసిన త్యాగం మరువలేనిదని కొనియాడారు.సమాజ సేవలో నిరంతరం భాగస్వామ్యం అవుతూ సామాజిక రుగ్మతలను రూపుమాపుటకు నిరంతరం కృషి చేశారని అన్నారు. అమరజీవి అడుగుజాడలలో నడవాలని, ఆయనను స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. ఈకార్యక్రమంలో వాసవీ క్లబ్ అధ్యక్షులు ఆరిశెట్టి గోవిందరాజులు, జోనల్ ఛైర్మన్ ఆరిశెట్టి వెంకట సత్యనారాయణ, రీజనల్ ఛైర్మన్, జిల్లా ఆర్యవైశ్య సంఘం ప్రధాన కార్యదర్శి మమ్ముల విశ్వేశ్వరరావు, ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు కూర్మదాసు లక్ష్మణరావు, కూర్మదాసు శ్రీనివాసరావు, గ్రంది శ్రీనివాసరావు, త్రినాథరావు, దేముడు, వెంకటరాజు, సత్తిరాజుతోపాటు మండలనాయకులుసాల హరిగోపాల్, కంకణపల్లి అరవింద్, రమేష్, వెంకన్న, కార్యదర్శులు వెంకటరావు,సుధారాణి, సచివాలయం సిబ్బంది, పలువురు ఆర్యవైశ్యులు,గ్రామస్తులు పాల్గొన్నారు.
పుస్తకాలు,పెన్నులు, బిస్కట్లు పంపిణి:
మండల కేంద్రంలోని ఎం ఆర్ సి ప్రాంగణంలోగల ప్రాధమిక పాఠశాలలో  (బోర్డ్ స్కూల్) గల 88మంది విధ్యార్థులకు, భవిత కేంద్రంలోని ఎనిమిది మంది విద్యార్థులకు పొట్టి శ్రీరాములు జయంతిని పురస్కరించుకొని పెన్నులు, నోట్ పుస్తకాలు, బిస్కెట్ పాకెట్లును వాసవీ క్లబ్ ఆధ్వర్యాన పంపిణి చేశారు. దీంతో పాటు అక్కడే ఉన్న అంగన్వాడి కేంద్రంలోని చిన్నారులకు కూడా వాటిని అందజేసారు. ఈకార్యక్రమంలో ఉప సర్పంచ్ అరవింద్,పాఠశాల హెచ్ఎం
ఐ.సత్యం,ఉపాధ్యాయులు చంద్రశేఖర్,హేమలత,ఆదినారాయణ,
భవిత కేంద్రం టీచర్ కృష్ణ మోహన్,అంగన్వాడి కేంద్ర టీచర్ శైలజలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img