Friday, April 19, 2024
Friday, April 19, 2024

అంటిపేటలో దాన్యాల నాణ్యతపై అవగాహణ

విశాలాంధ్ర, సీతానగరం: మండలంలోని అంటిపేట రైతుభరోసా కేంద్రంవద్ద గ్రామ వ్యవసాయ సలహా మండలి సమావేశంనునిర్వహించారు. రైతులవద్ధ నుండి ధాన్యాలు నాణ్యతాపరీక్ష గూర్చి, రైతుల కల్లాలదగ్గర నుండి తీసుకునే ధాన్యం నాణ్యతా ప్రమాణాలను గురించి ఏఓ అవినాష్ అవగాహన కల్పించారు.అలాగే రైతుల కల్లాల్లో రాసిపోసిన ధాన్యాలనుసాంకేతిక సహాయకుడువెళ్లి పరీక్షించిన తరువాత మాత్రమే ధాన్యాలను తరలించే ఏర్పాటు చేస్తామని చెప్పారు.అలాగే గ్రామంలో ఉన్నవాహనాలను రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఆవాహనాలలోనే ధాన్యాలనుపంపించి ఆపైకమును రైతుఖాతాలో వేస్తారని తెలిపారు ధాన్యం ఖచ్చితంగా నాణ్యతా పరీక్షలుచేసి మిల్లులకు పంపాలని గ్రామ వ్యవసాయ సహాయకులుకు సూచించారు.ఈకార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సిరికి మహేశ్వర్ రావు,మాజీ జడ్పీటీసీ అంబటి కృష్ణంనాయుడు, జిల్లా బీసీ కార్పొరేషన్ డైరెక్టర్ శనపతి తిరుపతి, ఉపసర్పంచ్ బొంగు తిరుపతి, పంచాయతీ సెక్రటరీ శశిభూషణ్,గ్రామ వ్యవసాయ సహాయకులు లావణ్య, గ్రామ పెద్దలు, వాలంటీర్లు, రైతులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img